వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ పేరు: కాంగ్రెస్ నేతల ముట్టడి, అరెస్టు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శుక్రవారంనాడు ఉద్రిక్తత నెలకొంది. శంషాబాద్‌ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌ పేరు మార్చడాన్ని నిరసిస్తూ విమానాశ్రయం ముట్టడికి బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తలను గగన్‌పహాడ్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్రయ ముట్టడి సమాచారం తెలిసిన పోలీసులు ఆ మార్గంలో భారీగా మోహరించారు.

అయినప్పటికీ వి. హనుమంతరావు, దానం నాగేందర్, పలువురు నేతలు పోలీసుల కల్లుగప్పి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టు పేరును మార్చవద్దని డిమాండ్‌ చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దానం, వీహెచ్‌ సహా పలువురిని అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా వి. హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆధిపత్యం కోసం ఎన్టీరామా రావు పేరును చంద్రబాబు పెట్టించారని ఆయన విమర్శించారు.

శంషాబాద్ విమానాశ్రయం ఇలా..

శంషాబాద్ విమానాశ్రయం ఇలా..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అయితే, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పోలీసులు అప్రమత్తం

పోలీసులు అప్రమత్తం

శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెసు ఆందోళనకు దిగుతుందనే నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోలీసుల కళ్లు గప్పి..

పోలీసుల కళ్లు గప్పి..

విమానాశ్రయం ముట్టడికి బయలుదేరిన కాంగ్రెసు నేతలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, వారి కళ్లు గప్పి విహెచ్, దానం నాగేందర్ తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఇలా నిశబ్దంగా...

ఇలా నిశబ్దంగా...

కాంగ్రెసు నేతలు ఆందోళనకు దిగడానికి ముందు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా నిర్మానుష్యంగా కనిపించింది.

కాంగ్రెసు నేతల నిరసన

కాంగ్రెసు నేతల నిరసన

శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెసు నేతలు ధర్నాకు దిగారు.

ఇలా నినాదాలు..

ఇలా నినాదాలు..

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెసు నేతలు ఆందోళనకు దిగారు.

పోలీసులు ఇలా...

పోలీసులు ఇలా...

ఆందోళనకు దిగిన కాంగ్రెసు నేతలు వి. హనుమంతరావు, దానం నాగేందర్ తదితరులకు నచ్చజెప్పడానికి పోలీసులు ప్రయత్నించారు.

విహెచ్ ఇలా..

విహెచ్ ఇలా..

ధర్నాకు దిగిన కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు..

ఇలా అరెస్టు..

ఇలా అరెస్టు..

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెసు నాయకులను పోలీసులు ఇలా అరెస్టు చేశారు.

దానం నాగేందర్‌ను ఇలా..

దానం నాగేందర్‌ను ఇలా..

శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌ను పోలీసులు ఇలా ఎత్తుకెళ్లారు.

హనుమంతరావును ఇలా..

హనుమంతరావును ఇలా..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన విహెచ్‌ను పోలీసులు ఇలా అరెస్టు చేశారు.

రాజీవ్ గాంధీయే కారణం..

రాజీవ్ గాంధీయే కారణం..

దేశంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి పాదులు వేసినవారు రాజీవ్ గాంధీ అని, ఎన్టీఆర్ పేరును వ్యతిరేకించడం ప్రాంతీయ విభేదాలు ఏమీ లేదని దానం నాగేందర్ అన్నారు.

విమానాశ్రయంలో ఇలా..

విమానాశ్రయంలో ఇలా..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కాంగ్రెసు నేతల ముట్టడి పిలుపు నేపథ్యంలో శుక్రవారంనాడు ఇలా కనిపించింది.

విమానాశ్రయం వద్ద ఇలా..

విమానాశ్రయం వద్ద ఇలా..

శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెసు నాయకులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఇలా..

English summary
V Hanumanth Rao, Danam Nagender and other Congress leaders arrested for protesting against naming Shamashabad airport domestic terminal after NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X