వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: ఆజాద్ రాకతో గాంధీభవన్ సందడి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌‌: కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల మాజీ ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రాకతో బుధవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో సందడి నెలకొంది. ఆజాద్ విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం నేరుగా గాంధీభవన్ చేరుకున్నారు. పివి నర్సింహారావు స్మారకోపన్యాసం చేయడానికి ఆయన నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది.

గాంధీభవన్‌లో ఆజాద్‌ను పలువురు నాయకులు కలుసుకున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన మంత్రి కె. జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ఆజాద్ విడివిడిగా సమావేశమయ్యారు.

తెలంగాణకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఆయనను కలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెసు పరిస్థితిపై గులాం నబీ ఆజాద్ ఆరా తీసినట్లు చెబుతున్నారు.

గాంధీభవన్ వద్ద ఆజాద్ 1

గాంధీభవన్ వద్ద ఆజాద్ 1

హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమానాశ్రయం నుంచి నేరుగా కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ చేరుకున్నారు. ఆయన వెంట పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు.

గాంధీభవన్ వద్ద ఆజాద్ 2

గాంధీభవన్ వద్ద ఆజాద్ 2

చెవి ఒగ్గి ఎవరో అన్న మాటలను వింటున్నట్లు గులాం నబీ ఆజాద్ ఇలా కనిపించారు. ఆయన వెంట ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ ఉన్నారు.

గాంధీభవన్ వద్ద ఆజాద్ 3

గాంధీభవన్ వద్ద ఆజాద్ 3

ఆజాద్ రాక సందర్భంగా కాంగ్రెసు కార్యకర్తలు పెద్ద యెత్తున గాంధీభవన్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న బొత్స సత్యనారాయణ

గాంధీభవన్ వద్ద ఆజాద్ 4

గాంధీభవన్ వద్ద ఆజాద్ 4

ఆజాద్ రాక సందర్భంగా జర్నలిస్టులు ఆయనను కలుసుకోవడానికి ప్రయత్నించారు. వారిని ఆజాద్ సెక్యూరిటీ సిబ్బంది తోసివేసింది. ఇది బొత్స సత్యనారాయణ సమక్షంలోనే జరిగింది

గాంధీభవన్ వద్ద ఆజాద్ 5

గాంధీభవన్ వద్ద ఆజాద్ 5

గులాం నబీ ఆజాద్ గాంధీ భవన్ వచ్చినప్పుడు సందడి నెలకొంది. ఆయన గాంధీ భవన్‌లో కొంత మంది నేతలతో మాట్లాడిన తర్వాత వేరే చోట పివి నర్సింహారావు స్మారకోపన్యాసం ఇచ్చారు.

English summary
Union minister and Congress leader Ghulam Nabi Azad has met Telangana leaders K Jana Reddy and deputy CM Damodara Rajanarsimha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X