రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం: గిరిజ అవయవాలే వచ్చాయి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బోరుబావిలో పడిన చిన్నారి గిరిజన ఉదంతం విషాదాంతమైంది. ఆదివారం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ చిన్నారి గిరిజ (5) మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. వెయ్యి కళ్లతో ఉత్కంఠగా ఎదురు చూసిన గిరిజ కుటుంబసభ్యులు చివరికి చేదువార్తే వినాల్సి వచ్చింది.

అరవై గంటల పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూటీమ్‌లు, జిల్లా, మండల యంత్రాంగం, పోలీసులు చేసిన శ్రమ వృథా అయ్యింది. ప్రాణాలతో బయటకి వస్తుంది అనుకున్న మంచాల మండల ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. గిరిజ మృతి చెందిందన్న వార్త విన్న ఆమె అమ్మమ్మ, తండ్రి, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు ప్రజలు గుండెలవిసేలా విలపించారు.

ఎన్ని ఆటంకాలు ఎదురయినా అధికారులు, రెస్క్యూటీమ్ గిరిజను ప్రాణాలతో బయటకు తీస్తారనుకున్న నిరీక్షణ ఫలించలేదు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో ఆదివారం ఆడుకుంటూ వెళ్ళి పడిపోయిన గిరిజ (5) మృత్యువు ఒడికి చేరిందన్న వార్త ప్రతిఒక్కరినీ విషాదంలోకి నెట్టింది.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

మూడు రోజుల గిరిజను బయటికి తీయాలన్న తపనతో చేసిన ప్రయత్నాలన్నీ బెడసికొట్టాయి. బోరుబావికి సమాంతరంగా సుమారు 45 అడుగుల మేర ప్రొక్లయినర్లు, జెసిబిల సహాయంతో తవ్వకాలు జరిపిన రెస్క్యూటీం సిబ్బంది గిరిజను చేరుకోలేకపోయారు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

కొక్కేలకు తాడుకట్టి గిరిజ మృతదేహాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తుండగా గిరిజ అవయవాలు వేర్వేరుగా బయటికి వచ్చాయి. దీంతో అధికారులు కాసేపు తలలు పట్టుకుకూర్చున్నారు. ఏమిచేయాలో పాలుపోని స్థితిలో చివరకు ఆ అవయవాలనే బయటకు తీశారు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరజ బోరుబావిలో పడిపోయిందన్న వార్త విని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూటీమ్‌లకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

ముందుగా బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరిపేందుకు జెసిబిలను రప్పించినా ఫలితం దక్కలేదు. దీంతో హిటాచీ ప్రొక్లైనర్‌లను రప్పించి తవ్వకాలను కొనసాగించారు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

మూడు రోజుల పాటు కొనసాగిన సహాయక చర్యల్లో రెండవ రోజైన సోమవారం బోరుబావికి పక్కగా పెద్ద బండరాయి అడ్డురావడంతో కంప్రెషర్ సహాయంతో బండరాయిని పగులగొట్టి రాయిని తొలగించాల్సి వచ్చింది.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజ 40 అడుగుల్లోపే ఉందనుకున్న అధికారుల అంచనాలు తప్పడంతో నలబై ఏడు అడుగుల మేర తవ్వకాలు జరిపారు. అయినప్పటికీ గిరిజ బోరుబావిలో పడిన రోజునే మృతిచెంది ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

కనీసం గిరిజ మృతదేహాన్ని బయటికి తీయాలనే తపనతో మంగళవారం అర్థరాత్రి వరకు సహాయక చర్యలని వీడలేదు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజ మృతిచెందిదన్న వార్త జిల్లా యంత్రాంగం ప్రకటించడంతో ఒక్కసారిగా మంచాల మండలంలో విషాదచాయలు అలుముకున్నాయి.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజ కుటుంబ సభ్యులతో పాటు మండల మొత్తం గిరిజ క్షేమంగా బయటికి వస్తుందని నిరీక్షించగా వారి ఆశలు ఫలించలేదు. గిరిజ మృతి వారందరినీ విషాదంలోకి నెట్టివేసింది.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజ మృతదేహం కూడా రాకపోగా, ఆమె అవయవాలు ఒక్కొక్కటిగా కొక్కేల ద్వారా బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి ఆమె అమ్మమ్మకు అప్పగించారు.

గిరిజను మింగేసిందిఅత్యాధునిక సీసీ కెమెరాలను వినియోగించి పాప

గిరిజను మింగేసిందిఅత్యాధునిక సీసీ కెమెరాలను వినియోగించి పాప

45-50 ఫీట్ల మధ్య ఉన్నట్లు తేల్చారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించిన రెస్క్యూటీం బోరుబావికి సొరంగాన్ని చేసి చిన్నారి చేతులకు తాడుకట్టి లాగే ప్రయత్నం చేశారు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

ఘటనా స్థలానికి మధ్యాహ్నమే వచ్చిన జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి రాత్రివరకూ ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోరుబావిలో నీరు ఉండడంతో పాప మృతి చెందినట్లు చెప్పారు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది బండరాయి అడ్డుగా రావడం పాప మృతదేహం వెలికి తీసేందుకు కష్టంగా మారిందని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.

గిరిజను మింగేసింది

గిరిజను మింగేసింది

బోరుబావి ఘటన అత్యంత బాధాకరమని ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
Five years old Girija slipped into boreweel at Manchala in Rangareddy district dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X