వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఖుషీ: గోల్కొండ కోటపై జెండా ఉంఛా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరణకు అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తాను అనుకున్న విధంగా గోల్కొండ కోటపైనే మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు.

పంద్రాగస్టు వేడుకలను ఈసారి పరేడ్‌గ్రౌండ్‌లో కాకుండా గోల్కొండ కోటలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఆర్మీతో పాటు పురావస్తు శాఖ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ఆర్మీ అధికారులతో కూడా మాట్లాడారు.

పురావస్తు శాఖ నుంచి కూడా అనుమతి కోరుతూ లేఖ రాశారు. వీరి అనుమతి రావటం కూడా లాంఛనమేనని అధికారవర్గాలు తెలిపాయి. 15న జెండా ఆవిష్కరణ సందర్భంగా, గోల్కొండ వద్ద పెద్ద ఎత్తున ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయటంతో పాటు ఆ ప్రాంతాన్ని సర్వాంగసుందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

గోల్కొండ కోటపైనే..

గోల్కొండ కోటపైనే..

గోల్కొండ కోటలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారంనాడు అధికారులతో సమీక్షించారు.

గోల్కొండ కోటలోనే..

గోల్కొండ కోటలోనే..



తొలుత అనుకున్నట్టే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు‌ రాణీమహల్‌ వద్దే జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అయితే అక్కడ కవాతులు, శకటాల ప్రదర్శన నిర్వహించరు.

గోల్కొండ కోటలోనే..

గోల్కొండ కోటలోనే..

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించడానికి వృద్ధులు, పిల్లల కోసం గోల్కొండకు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గోల్కొండ కోటలోనే...

గోల్కొండ కోటలోనే...

తెలంగాణ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. అందుకు ఇలా ముందస్తు...

గోల్కొండ కోటలోనే...

గోల్కొండ కోటలోనే...

గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి అడ్డంకులు తొలగిపోయాయి. దాంతో ఇలా పచ్చగా...

గోల్కొండ కోటలోనే...

గోల్కొండ కోటలోనే...

తెలంగాణ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలో జరుగుతాయి. దీంతో అందుకు ముందస్తు కసరత్తు జరుగుతోంది.

గోల్కొండ కోటలోనే...

గోల్కొండ కోటలోనే...

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగే గోల్కొండ కోటలో ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పరిశీలించారు. తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao will hoist the national flag on Golconda fort on August 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X