వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలని జ'గన్': ఓటమిని అంగీకరిస్తూ ఇలా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలో మూకుమ్మడి దాడిని ఎదుర్కోవడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విఫలమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కటై జగన్ అవినీతిపై విరుచుకుపడుతుంటే తిప్పికొట్టడంపై ఆయన శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తోంది. ప్రతిగా చంద్రబాబుపై పాత ఆరోపణలనే మళ్లీ మళ్లీ చేస్తూ వెళ్లారు. రెండెకరాల ఆసామీ కోట్లు ఎలా సంపాదించారని అడుగుతూ వెళ్లారు. కానీ తనపై చేసిన ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోయారు.

మరోవైపు, కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా వైయస్ జగన్‌పై విమర్శలు చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు ప్రచారానికి సారథ్యం వహించిన చిరంజీవి ఆయనపైనే విమర్శలు చేస్తూ వెళ్లారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చెబుకుంటూ వెళ్లారు. వైయస్‌పై ఉన్న అభిమానంతో మాత్రమే ఆయన విజయం సాధించాలని అనుకున్నారు. కానీ, సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేస్తాననే విషయాన్ని చెప్పలేకపోయారు.

ఫలితాల విషయంలో ఆయన అతిగా కూడా అంచనా వేసినట్లు కనిపిస్తున్నారు. తనకు తిరుగులేని విజయం దక్కుతుందని ఆయన భావించారని చెప్పవచ్చు. పార్టీ నిర్మాణంపై శ్రద్ధ పెట్టకపోవడం కూడా వైఫల్యానికి కారణమైందని చెప్పవచ్చు.

వైసిపిలో నిస్తేజం

వైసిపిలో నిస్తేజం

ఓటమితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నిస్తేజం అలుముకుంది. ఏ మాత్రం సందడి కనిపించలేదు. లోటస్ పాండ్ ఇలా కనిపించింది.

వైసిపి కార్యాయం ఇలా..

వైసిపి కార్యాయం ఇలా..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం కూడా శుక్రవారం నిర్మానుష్యంగా కనిపించింది. పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు.

ఓటమిని అంగీకరిస్తూ...

ఓటమిని అంగీకరిస్తూ...

ఫలితాలు వెలువడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్షంగానే...

ప్రతిపక్షంగానే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, ఐదేళ్ల తర్వాత తాను వస్తానని జగన్ చెప్పారు.

చంద్రబాబుపై నిందలు

చంద్రబాబుపై నిందలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చి విజయం సాధించారని జగన్ విమర్శించారు.

English summary
YSR Congress party president YS Jagan failed counter Telugudesam party president Nara Chandrababu Naidu, Jana sena chief Pawan Kalyan and BJP PM candidate Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X