వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తిక్ రెడ్డి: ఇంద్రారెడ్డి వారసుడొచ్చాడు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి సతీమణి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డి రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేశారు. తెలంగాణ కోసం యాత్ర చేపట్టిన ఇంద్రారెడ్డి కాంగ్రెసులో చేరారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇంద్రారెడ్డి మరణం తర్వాత సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా కూడా పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో సబితా ఇంద్రారెడ్డి నిందితురాలిగా ఉన్నారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో చిక్కుకోవడంతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు తన కుమారుడు కార్తిక్ రెడ్డిని ప్రజల్లోకి తీసుకుని వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేసిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపుతూ కార్తిక్ రెడ్డి నవ నిర్మాణ్ పేర పాదయాత్ర చేస్తున్నారు.

కార్తిక్ రెడ్డి వెంట ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రజల్లోకి వస్తున్నారు. బుదవారం పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి కూడా పాల్గొన్నారు. వైయస్ జగన్ వైపు వెళ్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి తాము కాంగ్రెసులో ఉంటామనే బలమైన సంకేతాలను పార్టీ అధిష్టానానికి పంపాలని నిర్ణయించుకోవడంలో భాగంగానే ఈ పాదయాత్ర చేపట్టినట్లు అర్థమవుతోంది.

ఇంద్రారెడ్డి వారసుడు 1

ఇంద్రారెడ్డి వారసుడు 1

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ పి. ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి నవ నిర్మాణ్ పేర రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేపట్టారు.

ఇంద్రారెడ్డి వారసుడు 2

ఇంద్రారెడ్డి వారసుడు 2

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టి కాంగ్రెసులోనే ఉంటానని బలమైన సంకేతాలు ఇవ్వడానికి కార్తిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని భావిస్తున్నారు.

ఇంద్రారెడ్డి వారసుడు 3

ఇంద్రారెడ్డి వారసుడు 3

కార్తిక్ రెడ్డి బుధవారం చేసిన పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు ఇలా పెద్ద యెత్తున కనిపించారు. ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డికి రంగారెడ్డి జిల్లాలో బలమైన వర్గం ఉంది.

ఇంద్రారెడ్డి వారసుడు 4

ఇంద్రారెడ్డి వారసుడు 4

రాజకీయాల్లో దివంగత నేత పి. ఇంద్రారెడ్డికి మంచి పేరుంది. ఆ పేరు కార్తిక్ రెడ్డికి రాజకీయాల్లో ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇంద్రారెడ్డి వారసుడు 5

ఇంద్రారెడ్డి వారసుడు 5

కార్తిక్ రెడ్డి పాదయాత్రలో డప్పుల మోతలు, నినాదాలు వెల్లువెత్తాయి. ఆయన రాజకీయంగా బలమైన నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంద్రారెడ్డి వారసుడు 6

ఇంద్రారెడ్డి వారసుడు 6

కార్తిక్ రెడ్డి పాదయాత్రలో మహిళలు కూడా పెద్ద యెత్తునే కనిపించారు. కాంగ్రెసు జెండాలు చేత బూని వారు కార్తిక్ రెడ్డిని అనుసరించారు.

ఇంద్రారెడ్డి వారసుడు 7

ఇంద్రారెడ్డి వారసుడు 7

కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మద్దతును కార్తిక్ రెడ్డి కోరుతున్నట్లు కనిపిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో సబితా ఇంద్రారెడ్డికి, జైపాల్ రెడ్డికి మధ్య పొరపొచ్చాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ అగాధాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇంద్రారెడ్డి వారసుడు 8

ఇంద్రారెడ్డి వారసుడు 8

పాదయాత్ర సందర్భంగా ఏర్పాటైన సభలో వేదికపై నుంచి అభివాదం చేస్తూ కార్తిక్ రెడ్డి ఇలా కనిపించారు. ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి రూపురేఖలను పుణికి పుచ్చుకున్నట్లు అనిపిస్తోంది.

ఇంద్రారెడ్డి వారసుడు 9

ఇంద్రారెడ్డి వారసుడు 9

తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుల చిత్రాలతో కార్తిక్ రెడ్డి పోస్టర్లను రూపొందించారు. వారి అండదండలను అందుకుంటూ రాజకీయాల్లో తన స్థానం సంపాదించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది.

ఇంద్రారెడ్డి వారసుడు 10

ఇంద్రారెడ్డి వారసుడు 10

ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డికి తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి మద్దతు తెలిపారు. జానారెడ్డిని జైపాల్ రెడ్డి ప్రతినిధిగా కూడా భావించవచ్చు.

ఇంద్రారెడ్డి వారసుడు 11

ఇంద్రారెడ్డి వారసుడు 11

పాదయాత్ర సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి కె. జానారెడ్డితో పాటు కార్తిక్ రెడ్డి తల్లి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలా కనిపించారు.

ఇంద్రారెడ్డి వారసుడు 12

ఇంద్రారెడ్డి వారసుడు 12

రాజకీయాల్లో నన్ను ఆదరించారు, నా కుమారుడిని కూడా ఆశీర్వదించండని చెబుతున్నారా అనేట్లు కార్తిక్ రెడ్డి తల్లి సబితా ఇంద్రారెడ్డి రెండు చేతులూ జోడించి ప్రజలకు అభివాదం చేశారు.

ఇంద్రారెడ్డి వారసుడు 13

ఇంద్రారెడ్డి వారసుడు 13

కుమారుడు కార్తిక్ రెడ్డికి తల్లి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయ పాఠాలు చెబుతున్నట్లు కనిపిస్తున్నారు. కార్తిక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి.

ఇంద్రారెడ్డి వారసుడు 14

ఇంద్రారెడ్డి వారసుడు 14

రాజకీయాల్లో తన కుమారుడు కార్తిక్ రెడ్డికి కాంగ్రెసు పెద్దల అండదండలు లభించే విధంగా సబితా ఇంద్రారెడ్డి ఏర్పాట్లు చేసినట్లే కనిపిస్తున్నారు.

ఇంద్రారెడ్డి వారసుడు 15

ఇంద్రారెడ్డి వారసుడు 15

ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, తనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రకటించుకుంటున్నారు సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి.

ఇంద్రారెడ్డి వారసుడు 16

ఇంద్రారెడ్డి వారసుడు 16

ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డికి మంత్రి కె. జానా రెడ్డి ఆశీస్సులు పూర్తి స్థాయిలో లభించినట్లే చెప్పవచ్చు. తద్వారా కేంద్ర జైపాల్ రెడ్డి అండదండలు కూడా ఆయనకు లభిస్తాయి.

ఇంద్రారెడ్డి వారసుడు 17

ఇంద్రారెడ్డి వారసుడు 17

సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మంత్రి కె. జానారెడ్డి ఇలా పూర్తిగా రైతు వేషంలో దర్శనమిచ్చారు.

ఇంద్రారెడ్డి వారసుడు 18

ఇంద్రారెడ్డి వారసుడు 18

ఇంద్రారెడ్డి ప్రజలను నిత్యం పట్టించుకునేవారు. తండ్రి బాటలో నడుస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నట్లుగా కార్తిక్ రెడ్డి ఇలా...

English summary
Former minister late P Indra Reddy's son Karthik Reddy is making his entry into politics with the help of his mother Sabitha Indra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X