వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ స్టాఫ్‌తో కెసిఆర్ లంచ్: భరోసా, హెచ్చరిక (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. వారితో గురువారంనాడు మధ్యాహ్న భోజనం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులకు హెచ్చరికలు చేశారు.

కయ్యానికి కాలు దువ్వితే సహించబోమని ఆయన హెచ్చరించారు. కాదని అంటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని ఆయన అన్నారు. నకిలీ స్థానిక ధ్రువపత్రాలు సమర్పించి తెలంగాణలో ఉండిపోవడానికి సీమాంధ్ర ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇదంతా జరిగింది.

ఇదిలావుంటే, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు విఠల్‌ను సీమాంధ్రకు కేటాయించారు. ఓ నేతనే అలా కేటాయిస్తే ఉద్యోగుల విభజన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిన అశోక్‌బాబును తెలంగాణకు కేటాయిస్తే ఎలా పనిచేయగలుగుతారని విఠల్ ప్రశ్నిస్తున్నారు.

టీ ఉద్యోగులతో కెసిఆర్

టీ ఉద్యోగులతో కెసిఆర్

ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన నేపథ్యంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో కెసిఆర్ గురువారంనాడు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో లంచ్ చేశారు.

టీ ఉద్యోగులతో కెసిఆర్

టీ ఉద్యోగులతో కెసిఆర్

తెలంగాణ సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగులకు స్థానం లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులు మాత్రమే పనిచేస్తారని ఆయన చెప్పారు.

టీ ఉద్యోగులతో కెసిఆర్

టీ ఉద్యోగులతో కెసిఆర్

తెలంగాణ సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగులు ఎలా పనిచేస్తారని ఆయన అడిగారు. ఈ విషయంపై తాను చర్చిస్తానని ఆయన చెప్పారు.

మీడియాలో వస్తున్నట్లు జరగదు

మీడియాలో వస్తున్నట్లు జరగదు

మీడియాలో, వార్తా పత్రికల్లో వస్తున్నట్లు ఉద్యోగుల పంపిణీ జరగదని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడపడానికి తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు సీఎస్ చెప్పారని కెసిఆర్ తెలిపారు.

ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా

ఉద్యోగ సంఘాల నేతలకు భరోసా

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యోగులకు కెసిఆర్ సమావేశంలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

అప్రమత్తంగా ఉండాలి..

అప్రమత్తంగా ఉండాలి..

అన్ని శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, వివరాలను తమకు అందించాలని టిఎన్జీవో నేత దేవీప్రసాద్ చెప్పారు.

English summary

 Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao said the he will not allow Seemandhra employees to stay in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X