వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు: బండిపై రఘువీరా, బూత్‌లో బాలయ్య (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖ నాయకులు తమ ఓటు బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత వారు సిరా మరకలు అంటిన చూపుడు వేలిన ప్రదర్శించారు. చాలా మంది నాయకులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు.

అనంతపురం జిల్లా హిందూపురం శానససభ స్థానం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు సీమాంధ్రలో ఓటు హక్కు లేదు. ఆయనకు హైదరాబాదులో ఓటు ఉంది. దీంతో ఆయన హిందూపురంలో బుధవారం పోలింగ్ బూత్‌లను సందర్శిస్తూ ఓటింగు సరళిని పరిశీలించారు.

కడప జిల్లా పులివెందులలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి...

మాగుంట శ్రీనివాసులు రెడ్డి...

తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన తర్వాత ఇలా కనిపించారు.

రఘువీరా రెడ్డి ఇలా...

రఘువీరా రెడ్డి ఇలా...

సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన తర్వాత ఇలా కనిపించారు.

బాలకృష్ణ ఓ పోలింగ్ కేంద్రంలో...

బాలకృష్ణ ఓ పోలింగ్ కేంద్రంలో...

హిందూపురం శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓ పోలింగ్ బూత్‌లో ఇలా కనిపించారు.

కిల్లి కృపారాణి ఇలా..

కిల్లి కృపారాణి ఇలా..

కాంగ్రెసు శ్రీకాకుళం కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఓటు వేస్తూ ఇలా కనిపించారు. ఆమె జాతకం ఎలా ఉందో మరి..

ఎడ్ల బండిపై రఘువీరా...

ఎడ్ల బండిపై రఘువీరా...

సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ఎడ్ల బండిని తోలుతూ తన కుటుంబ సభ్యులతో ఇలా కనిపించారు.

ఓటు వేస్తూ షర్మిల..

ఓటు వేస్తూ షర్మిల..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేస్తూ వైయస్ భారతి

ఓటు వేస్తూ వైయస్ భారతి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వైయస్ అవినాష్ రెడ్డి ఓటు వేస్తూ..

వైయస్ అవినాష్ రెడ్డి ఓటు వేస్తూ..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ అభ్యర్థి అవినాష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అశోక్ గజపతి రాజు..

అశోక్ గజపతి రాజు..

తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు విజయనగరం జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బొత్స ఝాన్సీ ఇలా...

బొత్స ఝాన్సీ ఇలా...

పార్లమెంటు సభ్యురాలు, కాంగ్రెసు అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయనగరం జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బొత్స సత్యనారాయణ ఇలా..

బొత్స సత్యనారాయణ ఇలా..

మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో వచ్చి విజయనగరంలో తన ఓటును వేశారు.

రాయపాటి మీడియాతో..

రాయపాటి మీడియాతో..

గుంటూరు జిల్లా నర్సాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి ఓటేసిన తర్వాత బుధవారంనాడు మీడియాతో మాట్లాడారు.

పనబాక లక్ష్మి ఇలా..

పనబాక లక్ష్మి ఇలా..

బాపట్ల లోకసభ కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఓటు వేసిన తర్వాత ఇలా కనిపించారు.

టిజి వెంకటేష్ ఇలా..

టిజి వెంకటేష్ ఇలా..

కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి టిజి వెంకటేష్ ఓటేసిన తర్వాత ఇలా కనిపించారు.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇలా..

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇలా..

కర్నూలు లోకసభ కాంగ్రెసు అభ్యర్థి, కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓటేసిన తర్వాత తన చూపుడు వేలిని ప్రదర్శిస్తూ ఇలా కనిపించారు.

English summary
Leaders and candidates of different political parties, like Raghuveera Reddy, Kotla Suryaprakash reddy, Killi Kruparani cast their votes in Seemandhra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X