హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాతకొత్తల కలయిక: పేపర్ చూసి మాట్లాడ్డం రాదన్న కెసిఆర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరుపుకుంటున్న పార్టీ ప్లీనరీ కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుల్లో, కార్యకర్తల్లో శుక్రవారం ఉల్లాసం కనిపించింది. గత వార్షిక సమావేశాలకు భిన్నంగా ఈ ప్లీనరీ సమావేశం కనిపించింది. ఉద్వేగం స్థానంలో ఉల్లాసం చోటు చేసుకుంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఇతర పార్టీల నాయకులు టిఆర్ఎస్‌లో చేరారు. మంత్రి పదవులను కూడా చేజక్కించుకున్నారు. దాంతో ప్లీనరీలో పాతకొత్తల కలయిక కనిపించింది. నాయకులు, మంత్రులు పరస్పరం నవ్వుకుంటూ కనిపించారు.

ఎనిమిదో సారి టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కె. చంద్రశేఖర రావు సుదీర్ఘ ప్రసంగం చేశారు. తమ ప్రభుత్వం చేసిన, చేయనున్న పనులను వివరించారు. కాంగ్రెసు నాయకులపై కాస్తా ఎక్కువగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పరోక్షంగా చెణుకులు విసిరారు.

తన కుమారుడు కెటి రామారావు పేరును ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు రామారావు అని మాత్రమే అన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు, నాయని నర్సింహారెడ్డి, పార్టీ నేత కె. కేశవ రావు తదితరుల పేర్లను, రసమయి బాలకిషన్ పేరును ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ప్రసంగం ముగించబోయే ముందు ఎవరో కాగితం మీద రాసి పంపించారు. దాన్ని అందుకుంటూ తనకు పేపర్ చూసి మాట్లాడడం రాదని కెసిఆర్ అన్నారు. ఆ పేపరు చూసిన తర్వాత నిరుద్యోగులు నిరాశపడవద్దని, ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఆయన చెప్పారు.

యాదవ రెడ్డితో హరీష్

యాదవ రెడ్డితో హరీష్

కాంగ్రెసు నుంచి టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో మంత్రి టి. హరీష్ రావు ఇలా...

మంచిరెడ్డితో కడియం...

మంచిరెడ్డితో కడియం...

టిడిపికి గుడ్ బై చెప్పి తాజాగా టిఆర్ఎస్‌లోచేరిన మంచిరెడ్డి కిషన్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇలా...

బంగారు తెలంగాణ సాధించే వరకు...

బంగారు తెలంగాణ సాధించే వరకు...

తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు పోరాటం చేసినట్లుగానే బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమించబోమని కెసిఆర్ చెప్పారు.

మహమూద్ అలీతో కెసిఆర్ ఇలా...

మహమూద్ అలీతో కెసిఆర్ ఇలా...

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఏదో చెప్తుంటే శ్రద్ధగా వింటున్న ముఖ్యమంత్రి కెసిఆర్...

జగదీశ్వర్ రెడ్డితో ఇలా...

జగదీశ్వర్ రెడ్డితో ఇలా...

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి జగదీష్ రెడ్డికి ఏదో చూపిస్తూ ఇలా...

జితేందర్ రెడ్డితో ఇలా...

జితేందర్ రెడ్డితో ఇలా...

పార్టీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఏదో చెబుతుంటే వింటూ కెసిఆర్ ఇలా...

వేణుగోపాలాచారితో ఇలా...

వేణుగోపాలాచారితో ఇలా...

టిఆర్ఎస్ నాయకుడు వేణుగోపాలాచారితో ప్లీనరీ సమావేశం వేదికపై కెసిఆర్ ఇలా...

ఈ ముగ్గురు ఉల్లాసంగా...

ఈ ముగ్గురు ఉల్లాసంగా...

మంత్రులు నాయని నర్సింహారెడ్డి, కెటి రామారావు, తుమ్మల నాగేశ్వర రావు ఇలా ఉల్లాసంగా... తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు.

జెండాను ఆవిష్కరిస్తూ...

జెండాను ఆవిష్కరిస్తూ...

పార్టీ జెండాను ఆవిష్కరిస్తూ కెసిఆర్ ఇలా కనిపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ఏర్పాటైన తొలి ప్లీనరీ ఇదే...

కెసిఆర్ మహమూద్ అలీతో...

కెసిఆర్ మహమూద్ అలీతో...

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇలా..

అమరవీరులకు నివాళులు...

అమరవీరులకు నివాళులు...

ప్లీనరీ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అమరవీరులకు నివాళులు అర్పించారు.

కేశవరావుతో ఇలా...

కేశవరావుతో ఇలా...

పార్టీ సీనియర్ నాయకుడు కె. కేశవ రావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో వేదికపై ఇలా..

కెసిఆర్‌కు అభినందనలు

కెసిఆర్‌కు అభినందనలు

ఎనిమిదోసారి టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కెసిఆర్‌ను మహిళా నేతలు ఇలా అభినందించారు.

తలపాగా ఇలా..

తలపాగా ఇలా..

పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కెసిఆర్ ఇలా శిరస్త్రాణం ధరించారు.

తలపాగా ఇలా...

తలపాగా ఇలా...

టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కె. చంద్రశేఖర రావుకు ఇలా తలపాగా చుట్టారు.

English summary
Telangana Rastra samithi (TRS) plenary at LB stadium in Hyderabad wtnessed a mixture of old and new leaders. Telangana CM K Chandarsekhar Rao (KCR) explained the government schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X