వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదం: బండరాయి బోగీని బుల్లెట్‌లా చీల్చింది (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అతి వేగంగా దూసుకెళ్లిన లారీ కారణంగానే అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 20 టన్నుల బండను తీసుకుని ఓ లారీ వేగంగా దూసుకెళ్తున్న క్రమంలో అడ్డంగా రైల్వే క్రాసింగ్ వచ్చింది. రైల్వే క్రాసింగ్‌ను ధ్వంసం చేస్తూ లారీ రైలును ఢీకొట్టింది.

లారీలోని 20 టన్నుల గ్రానైట్‌ రాయి రైలు బోగీని ఛిద్రం చేసుకుంటూ ఇవతలనుంచి అవతలకు వెళ్లి పడింది. ఈ ప్రమాదంలో హెచ్‌1ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు, లారీ క్లీనర్‌ ప్రాణాలు కోల్పోయారు. మడకశిరనుంచి 20 టన్నుల గ్రానైట్‌ బండతో ఏపీ 16 టీటీ 9885 నెంబర్‌ లారీ ఆదివారం అర్ధరాత్రి బయలు దేరింది. క్లీనర్‌ నాగరాజే ఆ సమయంలో లారీ నడుపుతున్నాడు.

కాగా, రైలు ప్రమాదం ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రమాదానికి కారణమైన లారీని నడిపిన డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడంతో మరో డ్రైవర్‌ను ఇరికించేందుకు యత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. లారీని నడిపానని ఒప్పుకోవాలని గ్రానైట్ కంపెనీ యజమాని బెదిరిస్తున్నాడని డ్రైవర్ బాషా పోలీసులకు చెప్పాడు.

రైల్వే క్రాసింగ్ వద్ద..

రైల్వే క్రాసింగ్ వద్ద..

బండరాయితో నిండిిన లారీ పెనుకొండ సమీపంలోని రాజేశ్వరి కాలనీ సమీపంలో ఉన్న రైల్వే క్రా సింగ్‌ను చేరుకుంది. ఆ సమయంలో బెంగళూరు నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళుతుండడంతో రైల్వే గేట్‌ వేసి ఉంది. అది గమనించని నాగరాజు అతివేగంతో రైల్వే గేటునుంచి దూసుకుపోయి నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టాడు.

బండరాయి దూసుకెళ్లింది..

బండరాయి దూసుకెళ్లింది..

లారీలోని గ్రానైట్‌ బండ అతివేగంగా హెచ్‌ 1 బోగీని ధ్వంసం చేసుకుంటూ ఇటు నుంచి అటువైపునకు బుల్లెట్‌లా దూసుకుపోయింది.

మాజీ మంత్రి మరణం

మాజీ మంత్రి మరణం

బండరాయి దూసుకెళ్లడంతో ఆ బోగీలోని ఓ చాంబర్‌లో ప్రయాణిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటే్‌షనాయక్‌(82) మరణించారు.

వీరు కూడా..

వీరు కూడా..

అదే ప్రాంతానికి చెందిన రైతు ఈదూ రు పుల్లారావు(50), బెంగళూరు ఇండోఫిల్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ టీఎ్‌సడీ రాజు(50), అదే బోగీలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన సయ్యద్‌ అహ్మద్‌ (48)తోపాటు లారీ నడుపుతున్న తాడిపత్రికి చెందిన నాగరాజు(48) మరణించారు.

మిగతా బోగీలు కూడా..

మిగతా బోగీలు కూడా..



భారీ గ్రానైట్‌ రాయి రైలు బోగీని ఛిద్రం చేసిన క్రమంలో మిగిలిన బోగీలు కూడా కుదుపునకు గురయ్యాయి. హెచ్‌ 1 బోగీకి ముందున్న ఎస్‌ 1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5 బోగీలు పట్టాలు తప్పాయి.

చక్రాలు ఊడిపోయాయి..

చక్రాలు ఊడిపోయాయి..

దాదాపు 300 మీటర్ల దాకా రైలు అలాగే ముందుకు సాగడంతో వాటి చక్రాలు ఊడిపోయాయి. అలా వెళ్లిన ఆ బోగీలు 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనపై నిలిచిపోయాయి.

అదుపు తప్పితే..

అదుపు తప్పితే..

రైలు ఏమాత్రం అదుపుతప్పిఉన్నా ఆ బోగీలన్నీ వంతెనపైనుంచి లోయలోకి పడి ఉంటే ఊహించనంత భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది.

ప్రమాద స్థలిలో..

ప్రమాద స్థలిలో..

జిల్లా కలెక్టర్‌ శశిధర్‌, డీఐజీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రమాద స్థలికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, జడ్పీ చైర్మన్‌ చమన్‌, స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రమాద స్థలిని సందర్శించారు.

విచారణకు ఆదేశించలేదు..

విచారణకు ఆదేశించలేదు..

రైల్వేశాఖకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేనందున ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించలేదని నైరుతి రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సంజీవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

క్షణాల్లో ప్రమాదం

క్షణాల్లో ప్రమాదం

గేటు వేసినప్పుడు వాహనాలు అసలు రాలేదు. రైలు గేటు సమీపంలోకి రాగానే అవతలి వైపు నుంచి వాహనం వెలుతురు కనిపించింది.

ఒక్కసారిగా ప్రమాదం..

ఒక్కసారిగా ప్రమాదం..

ఒక్కసారిగా పెద్ద శబ్దంరావడంతో నా వద్దనున్న గ్రీన్‌సిగ్నల్‌ను రెడ్‌సిగ్నల్‌లోకి మార్చి సమాచారాన్ని అధికారులకు అందించారు. ప్రమాదం క్షణాల్లో జరిగిపోయింది.

నిద్రలోనే కన్నుమూశారు...

నిద్రలోనే కన్నుమూశారు...

ప్రమాదం క్షణాల్లో జరిగిపోయింది. ప్రయాణికులు నిద్రలోనే కన్నుమూశారు. మిగతా ప్రయాణికులు బాంబు దూసుకుపోయిందనే భయంతో మిగతా ప్రయాణికులు తల్లడిల్లారు.

English summary
The Congress MLA representing Devdurga in Raichur district was travelling to his native constituency from Bengaluru. His son, Mr B.T. Naik, is the sitting MP of Raichur in Karnataka.Passengers in the other bogies, mainly S-1, S-2 and S-3, which had derailed, had no idea what had happened and were unable to inform the police and ambulance services for an hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X