వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు చెప్పనే లేదు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై నిర్మలా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె వారికి భరోసా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి నివేదిక సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయనమె చెప్పారు.
రంగుమారిన కారణంగా తిరస్కరించిన అధీకృత, అనుమతిలేని పొగాకుకు కిలోకు అదనంగా రూ.20 చెల్లిస్తామని, 2 వారాల్లో మొత్తం పొగాకు కొనుగోలు చేస్తామని సీఎ చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ఈ మొత్తంలో రూ.15 కేంద్రం, రూ.5 రాష్ట్రం ఇస్తాయన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

దీనికి ముందు సీఎం చంద్రబాబు సమక్షంలో పొగాకు కొనుగోళ్ల అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో మిగిలి పోయిన పొగాకును 2 వారాల్లో కొనుగోలు చేస్తామన్నారు. ఈ ఏడాది జూలై 4న కేంద్రం పొగాకు కొనుగోళ్లపై బోర్డు చైర్మన్‌కు కొన్ని స్పష్టమైన ఆదేశాలిచ్చిందని మంత్రి సీతారామన్‌ తెలిపారు.

పొగాకును పరిశీలించిన నిర్మలా సీతారామన్

పొగాకును పరిశీలించిన నిర్మలా సీతారామన్

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు పరిస్థితిని పరిశీలించారు. ఆమె ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.

మాకు చెప్పనే లేదు

మాకు చెప్పనే లేదు


కేంద్రం ఆదేశాలను చైర్మన్‌ గోపాల్‌ అమలు చేయలేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రం దృష్టికి తీసుకురాలేదని నిర్మాల సీతారామన్ అన్నారు.

ప్రధానికి నివేదిక

ప్రధానికి నివేదిక

పొగాకు రైతుల సమస్యలసై ప్రధానికి నివేదిక ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. నెలాఖరుకు 172 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు జరుపుతామని ఆమె చెప్పారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు

ఆత్మహత్యలు చేసుకోవద్దు

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. రైతు సమస్యల పరిష్కారానికై ప్రజా ప్రతినిధులు రైతుల సూచనలు సలహాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

ఐటిసియే కారణం

ఐటిసియే కారణం

పొగాకు రైతుల ఆత్మహత్యలకు ఐటీసీ కారణమని పొగాకు రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ యలమంచిలి శివాజి ఆరోపించారు.

నిర్మలా సీతారామన్ పరామర్శ

నిర్మలా సీతారామన్ పరామర్శ

ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న ఇద్దరు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ శుక్రవారం పరామర్శించారు. టంగుటూరు మండలం పొదవారిపాలెంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించారు.

కుటుంబాలకు భరోసా

కుటుంబాలకు భరోసా

వలేటివారిపాలెం మండలం కొండసముద్రంలో ఆత్మహత్య చేసుకున్న వెంకట్రావు కుటుంబాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు.

English summary
Union minister Niramala Seetharaman visited tobbacco farmers families in Prakasam district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X