విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగ్గని సముద్రం అలల ఉధృతి: ప్రజల భీతి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో సముద్రం బీభత్సం సృష్టిస్తోంది. సముద్రం క్రమక్రమంగా ముందుకు చొచ్చుకుని వస్తోంది. తీరంలో కొతను పెంచుతోంది. సోమ, మంగళవారాల్లో అలల ఉధృతి కారణంగా భిమిలీ, విశాఖ నగర తీరాల్లో సముద్రం ముందుకు రావడంతో కొంత మేర ఆస్తి నష్టం కూడా సంభవించింది.

అలల ఉధృతికి తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్డుకు సమీపంలో అలలు దూసుకొస్తున్నాయి. బీచ్ రోడ్డులోని మంగమారిపేట తీరం భయం కలిగిస్తోంది. భిమిలీ తీరం జాలర్ల ఇ ళ్లను అలలు తాకుతున్నాయి. దీంతో ఓ ఇల్లు కూలిపోయింది.

అలలు దూసుకొస్తుండడంతో కొబ్బరి తోటలు కూలుతున్నాయి. వృక్షాలు నేలకొరుగుతున్నాయి. ముతపడిన రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రం రక్షణ గోడకు అలలు తీవ్రంగా తాకుతున్నాయి. దీంతో గోడ దాదాపు కూలిపోయే పరిస్థితి వచ్చింది. కూలిపోయిన ఇంట్లోని రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మందిని అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రానికి తరలించారు.

ముందుకొస్తున్న సముద్రం

ముందుకొస్తున్న సముద్రం

సోమవారంతో పోలిస్తే మంగళవారం మరింత ఎక్కువగా సముద్రపు నీరు రంగు మారింది. సముద్రం ముందుకు చొచ్చుకుని వస్తోంది.

ముందుకొస్తున్న సముద్రం

ముందుకొస్తున్న సముద్రం

నిజానికి యేటా జులై నుంచి సెప్టెంబర్ వరకు సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సముద్రంలో అల్పపీడనం, అల్పపీడన ద్రోణితో గాలులు బలంగా వీస్తాయి.

ముందుకొస్తున్న సముద్రం

ముందుకొస్తున్న సముద్రం

గాలి తీవ్రతకు అలలు పెరిగి, ఉధృతంగా లేచి కోతకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. సముద్రం నుంచి తీరం వైపు వీస్తున్న గాలులు వల్ల అలల ఉధృతి పెరిగి సముద్రం ముందుకు వస్తుంది.

ముందుకొస్తున్న సముద్రం

ముందుకొస్తున్న సముద్రం

విశాఖలో సోమ, మంగళవారాలకు మధ్య వ్యత్యాసం పెరిగి సముద్రం ఓ మీటరు ముందుకు వచ్చినట్లు గుర్తించారు.

ముందుకొస్తున్న సముద్రం

ముందుకొస్తున్న సముద్రం

ఒడిషా వద్ద తీరంలో చిన్నపాటి తుఫాను వాతావరణం నెలకొనడంతో దాని ప్రభావం ఇక్కడ పడుతోందని నిపుణులు అంటున్నారు.

ముందుకొస్తున్న సముద్రం

ముందుకొస్తున్న సముద్రం

ఏటా వర్షాకాలంలో నదులు, కాలువల నుంచి నీరు వచ్చి సముద్రంలో కలుస్తుంది. అప్పుడు ఇసుక కూడా భారీగా వచ్చి కలుస్తుంది. అయితే, కొన్నేళ్లుగా ఇది ఆగిపోయింది. దీంతో సముద్రం అలల ఒత్తిడిని తట్టుకునే స్థితి లేకుండా పోయింది.

ముందుకొస్తున్న సముద్రం

ముందుకొస్తున్న సముద్రం

వివిధ కారణాల వల్ల సముద్రంలోకి వచ్చి చేరే ఇసుక తగ్గుతుండడంతో తీరానికి అలల ఉధృతిని తట్టుకునే శక్తి లేకుండా పోతోంది.

English summary
Ocean waves are further intensifying in Coastal Andhra district in Andhra Pradesh since sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X