కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జిల్లాలో పోలింగ్ ఇలా జరిగింది (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: పోలింగ్ సందర్భంగా బుధవారం ఉదయం నుంచి కడప జిల్లాలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ కారుపైనే కాకుండా ఆయన నివాసంపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు దాడికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు కూడా కష్టాలు వచ్చినట్లు చెబుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఆయన ఈ జిల్లాలోని పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో ఓటేశారు. కడప జిల్లా మొత్తం పులివెందులను తలపిస్తోందని వైయస్ జగన్ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

మహిళల క్యూ

మహిళల క్యూ

కడప జిల్లా చెన్నూరులో ఓటేయడానికి క్యూ కట్టిన మహిళా ఓటర్లు. ఇక్కడ ఆ సమయంలో అంతా ప్రశాంతంగానే కనిపించింది.

వృద్ధులూ ఇలా...

వృద్ధులూ ఇలా...

కడప జిల్లా చెన్నూరులో ఓటేయడానికి పోలింగ్ బూత్‌కు వస్తున్న ఓ వృద్ధుడు. అతనికి సాయంగా ఓ మహిళ

ఓ వృద్ధురాలు ఇలా..

ఓ వృద్ధురాలు ఇలా..

ఓ వృద్దురాలు కడప జిల్లా చెన్నూరులో ఓటేయడానికి ఇలా వచ్చారు. ఆమెకు సాయంగా ఓ యువకుడు ఇలా..

ఓ వికలాంగుడు ఇలా..

ఓ వికలాంగుడు ఇలా..

కడప జిల్లా ఖాజీపేటలో ఓటేయడానికి ఓ వికలాంగుడు ఇలా వచ్చాడు. అక్కడ ఓటేయడానికి ప్రజలు బారులు తీరారు.

కమలాపురంలో ఇలా...

కమలాపురంలో ఇలా...

కడప జిల్లా కమలాపురంలో ఓటర్లు తమ ఓటు హక్కును ఇలా వినియోగించుకున్నారు. కమలాపురంలో కూడా ఓటర్లు బారులు తీరారు.

విఎన్ పల్లిలో ఇలా..

విఎన్ పల్లిలో ఇలా..

కడప జిల్లా విఎన్ పల్లిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓ ముస్లిం యువతి ఇలా..

English summary

 Kadapa district has witnessed clashes, kidnappings od TDP agents and other incidents during polling today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X