విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాతీయ విపత్తే: విశాఖలో కారత్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: గత నెలలో సంభవించిన హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ పర్యటించి తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కారత్ ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హుధుత్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు. పంటలు, ఇళ్లు కోల్పోయి పలువురు నిరాశ్రయులయ్యారని, వీరికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో బాధితులకు సాయం అందలేదని ఆరోపించారు.

హుదూద్ తుపాను కారణంగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. పచ్చటి చెట్లతో కళకళలాడిన స్టీల్‌ప్లాంట్ నేడు కళావిహీనమైందన్నారు. ఫర్నెస్, కోక్‌ఓవెన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటికీ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించలేదని అన్నారు.

బాధితులతో కారత్

బాధితులతో కారత్

విశాఖపట్నం తుఫాను బాధితులను సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆదివారంనాడు పరామర్శించారు.

విశాఖలో కారత్

విశాఖలో కారత్

సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆదివారంనాడు విశాఖపట్నంలోని తుఫాను తాకిడి ప్రాంతాల్లో ఇలా పర్యటించారు.

మొక్కలు నాటి...

మొక్కలు నాటి...

విశాఖలో పర్యటించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మొక్కలు నాటి వాటికి నీళ్లు పోస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

కారత్ డిమాండ్

కారత్ డిమాండ్

తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన స్టీల్‌ప్లాంట్‌కు రెండేళ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్‌హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడుల ఉపసంహరణపై...

పెట్టుబడుల ఉపసంహరణపై...

స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సిపిఎం పూర్తి స్థాయిలో పోరాడుతుందని హెచ్చరించారు.

వినతిపత్రం సమర్పణ

వినతిపత్రం సమర్పణ

స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘం (సిపిఎం అనుబంధం) నాయకుడు రామారావు కర్మాగారం తిరిగి కోలుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మెమొరాండాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్‌కు అందజేశారు.

బాధితులతో కారత్

బాధితులతో కారత్

సిపిఎం జాతీయ ప్రధానా కార్యదహర్శి ప్రకాశ్ కారత్ తుఫాను బాధితులను పరామర్సించి, వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

English summary
CPM general secretary Prakash Karat has visited Visakhapatnam Hudhud cyclone hit aereas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X