వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరియస్ భేటీలో దేవినేని ఉమపై కెసిఆర్ సరదా సంభాషణ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వారంతా శనివారం ఉదయం గవర్నర్ నరసింహన్ అధికారిక నివాసం రాజభవన్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే.

గవర్నర్‌ సమక్షంలో జలవివాదంపై సీరియస్‌గా చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విషయంలో సరదా సంభాషణ జరిగింది. దేవినేని ఉమ హైదరాబాద్‌లో ఎందుకు ఉండటం లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అడిగారు.

దానికి స్పందించిన దేవినేని ఉమమహేశ్వర రావు - తాను విజయవాడలోనే ఉంటానని బదులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని - మినిస్టర్‌ క్వార్టర్స్‌ నివాసం కేటాయిస్తే కూడా దేవినేని ఉమ తీసుకోలేని చెప్పారు. నీటి పారుదల శాఖ క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు గవర్నర్‌కు, కేసీఆర్‌కు వివరించారు.

రాజభవన్‌కు క్యూ

రాజభవన్‌కు క్యూ

కృష్ణా జలాల వివాదాన్ని గవర్నర్ సమక్షంలో పరిష్కరించుకోవడానికి తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు రాజభవన్‌కు క్యూ కట్టారు.

ఎపి సిఎం చంద్రబాబు

ఎపి సిఎం చంద్రబాబు

కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో పాటు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజభవన్‌కు వచ్చారు.

కలిసి వచ్చారు...

కలిసి వచ్చారు...

కృష్ణా జలాల వివాదంపై శుక్రవారం సాయంత్రం మాటల ఈటెలు దూసుకున్న ఇరు రాష్ట్రాల మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమ కలిసి నవ్వుకుంటూ రాజభవన్ ‌నుంచి బయటకు వచ్చారు.

ఇరువురు కలిసే ప్రకటించారు..

ఇరువురు కలిసే ప్రకటించారు..

కృష్ణా జలాల వివాదం పరిష్కారమైందని, పంటలను కాపాడడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని మంత్రులు దేవినేని ఉమ, హరీష్ రావు కలిసి ప్రకటించారు.

మీడియా సమావేశంలో ఇలా

మీడియా సమావేశంలో ఇలా

ఎపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు కలిసే మీడియా సమావేశంలో మాట్లాడారు.

చేతులు కలుపుకున్నారు..

చేతులు కలుపుకున్నారు..

శుక్రవారం సాయంత్రం ఒకరిపై మరొకరు నిప్పులు చెరుగుకున్న దేవినేని ఉమ, హరీష్ రావు చేతులు కలుపుకున్నారు. కలిసి నడిచారు.

English summary
Telangana CM K chandrasekhar Rao questioned that why he was not staying in Hyderabad. Andhra Pradesh CM Nara Chandrababu Naidu and Telangana CM K Chandrasekhar Rao met each other at Rajabhavan in the presence of governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X