వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రీస్తు కలలో కనిపించి..: అరెస్టైయిన సుధీర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం చేసిన మొండితోక సుధీర్‌ను తిరుమల టు టౌన్ పోలీసులు కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం రామానగరంలోని ఆయన స్వగృహంలో గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు.

తిరుమలలో అన్యమత ప్రచారం చేసి కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న వేంకటేశ్వరుని పైన, ఆయన భక్తుల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వాటిని యు ట్యూబ్‌లో ఉంచిన సంఘటన పాఠకులకు విదితమే. దీంతో టిటిడి యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుమల టు టౌన్ పోలీసులు నూజివీడు డిఎస్‌పి టిఎస్ వెంకట నారాయణ సహకారంతో సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సుధీర్‌ను అరెస్టు చేసిన విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి మీడియా సమావేశంలో వివరించారు. ఇతర మత క్షేత్రాల్లో అన్యమత ప్రచారం చేసి చట్టాన్ని ఉల్లంఘించినందుకు యాక్ట్ 2007లోని సెక్షన్లు 100/14యు/ ఎస్ 3 కింద, ఐటి అమెండ్‌మెంట్ యాక్ట్ 2008, 66(ఎ), (బి), 153 (ఎ), 295 (ఎ) ఆర్/డబ్ల్యు 34 ఐపిసి కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన సుధీర్‌ను మీడియా ముందు హాజరు పరిచారు. అనంతరం పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

హైందవ క్షేత్రమైన తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం చేసి పొరపాటు చేశానని, ఇకపై ఎవరూ అలా చేయవద్దని సుధీర్ అంటూ పాస్టర్ సుధీర్ మీడియా ముందు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

జన్మతః తాను హిందువునేనని, ఏసుక్రీస్తు తన కలలో కనపడి మతం మారమంటే క్రైస్తవుడిగా మారానని చెప్పుకున్నాడు. తన వెనుక ఎవరూ లేరని, తనకే ఈ బుద్ధి పుట్టి పొరపాటు చేశానని అన్నాడు.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

హిందువుగా ఉన్నప్పుడు తాను రెండు పర్యాయాలు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు అరెస్టయిన సుధీర్ చెప్పాడు.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

విదేశీ నిధుల కోసం ఇలా చేశానని చెప్పడం సరికాదని సుధీర్ అన్నాడు. తనకా అవసరం లేదన్నాడు. యు ట్యూబ్‌లో నిధులు ఇవ్వాలని ఎందుకు కోరావని ప్రశ్నిస్తే సరైన సమాధానం లభించలేదు.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

రామానగరంలోని మొండితోక పరమానందం, సుశీల దంపతులకు పదిమంది సంతానం. వీరిలో ఎనిమిది మంది మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. సుధీర్ ప్రథమ సంతానం.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

సుధీర్ కుటుంబంలోని నలుగురు పురుషులు వివిధ ప్రాంతాలలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలలో పాస్టర్లుగా పనిచేస్తున్నారు.

సుధీర్ అరెస్టు

సుధీర్ అరెస్టు

అన్యమత ప్రచారం చేస్తున్న సుధీర్ రామానగరంలో బహుళ అంతస్థుల చర్చిని నిర్మించి ప్రార్థనలు చేస్తుండటంతో పాటు క్రైస్తవేతరులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాడు. ఇతర క్రైస్తవ సంస్థల్లో కూడా సుధీర్ పలు పదవులు నిర్వహిస్తున్నాడు.

English summary

 Pastor Sudhir, along with three others who are seen proselytizing Hindus to Christianity on Tirumala hills , has been taken into custody in Nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X