వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫీస్‌లకు తాళాలు: బోరుమన్న ఎమ్మార్వో వనజాక్షి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ : మునుసూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్‌, సబ్‌కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలకు తాళాలు వేసిన ఉద్యోగులు ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు.

కాగా, తనపై జరిగిన దాడిని వివరిస్తూ వనజాక్షి గురువారం మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తనను నోటికొచ్చినట్లు దుర్భాషలాడారని, డ్వాక్రా మహిళలను రెచ్చగొట్టి దాడి చేయించారని ఆమె ఆరోపించారు. తన కుటుంబాన్ని అవమానిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని అన్నారు

సభ్య సమాజంలో మహిళల పట్ల ఇలాగేనా మాట్లాడేదని ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షి బోరున విలపించారు. గురువారం కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబును కలిసేందుకు వచ్చిన ఆమె మీడియాకు జరిగిన సంఘటనను వివరించారు.

సమాచారం ఇలా వచ్చింది...

సమాచారం ఇలా వచ్చింది...

బుధవారం ఉదయం 9.30గంటల సమయంలో తనకు ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం వచ్చిందని, దీంతో రంగంపేట ఇసుక రీచ్‌ వద్దకు వెళ్లానని, అప్పటికే అక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్‌తోపాటు పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు, ఆయన అనుచరులు అక్కడ ఉన్నారని వనజాక్షి చెప్పారు.

సరిహద్దులు నిర్ణయించాకనే..

సరిహద్దులు నిర్ణయించాకనే..

రెండు జిల్లాల సరిహద్దును నిర్ధారించిన తర్వాత ఇసుక తోలుకోవచ్చునని నేను ఎమ్మెల్యేకు చెప్పానని, దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారని, నోటికొచ్చినట్టు దూషించారని, ఆర్‌ఐని కూడా దూషించారని వనజాక్షి చెప్పారు.

కాళ్ల మీద పడమన్నారు..

కాళ్ల మీద పడమన్నారు..

‘నువ్వు నీ తహసీల్దార్‌ ఇద్దరూ నా కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలి' అని చింతమనేని మాట్లాడారని, తాను ఆయనకు పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోకుండా వాగ్వాదానికి దిగారుని, తన వెంట ఉన్న డ్వాక్రా మహిళలను రెచ్చగొడుతూ.. ‘తహసీల్దారును పక్కకు ఈడ్చేయండి. పడేసి తొక్కండి. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా' అంటూ రెచ్చగొట్టారని ఆమె వివరించారు.

ఈడ్చేశారు...

ఈడ్చేశారు...

ఆరుగురు డ్వాక్రా మహిళలు నన్ను చేతులతో కొడుతూ మెడపట్టి ఇసుకలోకి తోసేశారని, అక్కడే ఉన్న మరో 44 మంది మగవారు కూడా బీభత్సం సృష్టించారని, ఎమ్మెల్యే గన్‌ మెన్‌ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ తీసుకుని ఇసుకలో వేసి తొక్కారని, ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్‌ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా నిస్సహాయంగా ఉండిపోయారే తప్ప దాడులను నిలువరించలేకపోయారని వనజాక్షి విలపిస్తూ చెప్పారు.

English summary
Krishna district Musunuru MRO Vanajakshi wept in front of media narrating the attack by MLA Chintamaneni and his followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X