వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి డిజిపి పై హైకోర్టులో కేసు : పార్క్ భూమిని ఆక్ర‌మించారు: వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల పిల్‌...!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌(ఆర్పీ ఠాకూర్‌) హైదరాబాద్, ప్రశాసన్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ప్ర‌శాస‌న్ న‌గ‌ర్‌లో..
హైదరాబాద్‌ ప్రశాసన్‌నగర్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు ప్లాట్లు కేటాయించిం దని రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆర్‌పీ ఠాకూర్‌ కూడా ప్లాట్‌ నంబర్‌ 149లో 502 చదరపు గజా ల స్థలం పొందారన్నారు. 1996లో జీహెచ్‌ఎంసీ నుంచి జీ+1కి అనుమతి పొందారని, దానికి విరుద్ధంగా జీ+3 నిర్మించా రని పేర్కొన్నారు. అయినా, ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్య తీసుకోలేదని తెలిపారు.

PIL Against AP DGP Thakur in High court : YCP Mla Alla filed case

2008లో ఆ అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరించుకున్నారు. 2017లో మరోసారి అక్రమ నిర్మాణాలను చేపట్టారని, ఈసారి జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి మరీ ఈ నిర్మాణాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒకటి నుంచి మూడో అంతస్తుకు మెటల్‌ ఫ్రేమ్‌ సాయంతో ఓ బ్రిడ్జిగా నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. దీనిపై పొరుగునే ఉన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.గోయల్‌ ఫిర్యాదు చేశారని పిటిష‌నర్ ఆళ్ల పేర్కొన్నారు.

చ‌ర్య‌లు తీసుకోండి..
పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్న విషయంపై కూడా గోయల్‌ ఫిర్యాదు చేశారని, దీనిపై వాస్తవాలను తేల్చేందుకు ఠాకూర్‌ ఇంటి వద్దకు జీహెచ్‌ఎంసీ అధికారులు వెళ్లగా, ఠాకూర్‌ మనుషులు ఆ అధికారులను అడ్డుకున్నారని తెలి పారు. ఆ తరువాత ఠాకూర్‌ దీనిపై సివిల్‌ కోర్టుకెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారని, ఆ తరువాత కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. ఈ పిటిషన్‌లో ఠాకూర్‌ ఎక్కడా కూడా తన హోదా గురించి ప్రస్తావించలేదని తెలిపారు.

వాస్తవాలను దాచి పెట్టి ఆ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని, అనుమతులు తీసుకో కుండా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసినా కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు ఠాకూర్‌పై చర్యలు తీసుకోవడం లే దన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ఠాకూర్‌ చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేసేలా జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించాలని కోరారు.

English summary
YCP MLA Alla Rama Krishna Reddy filed PIL Against AP DGP Thakur over Park Land Grab in Hyderabad. Govt alloted land for IPS officer Thakur in Prasan Nagar. Thakur try to grab park area for his own construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X