అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ మంత్రిపై హైకోర్టులో పిల్ వేసిన టీడీపీ నాయకుడు: కౌంటర్‌కు రెండు వారాల గడువు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా ఆరోపణలు చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలో 100 ఎకరాల చెరువును మంత్రి, ఆమె అనుచరులు ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు సంధించారు. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఈ పిల్ వేశారని తెలుస్తోంది.

మంత్రి ఉషశ్రీ చరణ్, ఆమె అనుచరుల పేర్లను ఈ పిల్‌లో పొందుపరిచినట్లు చెబుతున్నారు. కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని సర్వే నంబర్ 329లో వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండే సుబేదార్ చెరువును మంత్రి, ఆమె అనుచరులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. లారీలు, టిప్పర్లతో మట్టిని తరలించి..చెరువును పూడ్చి వేస్తోన్నారని విమర్శించారు. ఆ స్థలాన్ని ప్లాట్లు, వెంచర్లుగా మార్చి
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

PIL filed by TDP leader against Minister Ushasri Charan in AP High Court: Reports

పిటీషనర్ ఉమామహేశ్వర నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది బాలాజీ ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిల్‌లో పొందుపరిచిన విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. మంత్రి కావడం వల్ల పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ పిల్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

English summary
PIL filed by TDP leader against Minister Ushasri Charan in AP High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X