వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్బాల్ అహ్మద్‌కు బాబు హమీ: నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డికి ఇంఛార్జీ బాధ్యతలు?

పీలేరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ ఇక్బాల్‌అహ్మద్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. మీ రాజకీయ భవిష్యత్తు బాధ్యతను తనకు వదిలేయాని చంద్రబాబునాయుడు ఇక్భాల్‌కు భరోసా కల్పించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: పీలేరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ ఇక్బాల్‌అహ్మద్‌కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. మీ రాజకీయ భవిష్యత్తు బాధ్యతను తనకు వదిలేయాని చంద్రబాబునాయుడు ఇక్భాల్‌కు భరోసా కల్పించారు.అయితే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Recommended Video

Nallari Brother Joins TDP | Oneindia Telugu

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి: ఇంతియాజ్‌కు షాక్, బాబుకు కలిసొచ్చేనా?నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలోకి: ఇంతియాజ్‌కు షాక్, బాబుకు కలిసొచ్చేనా?

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఇతర పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని టిడిపిలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకొంది. నవంబర్ 23వ, తేదిన నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరనున్నారు.

ఆ వర్గాలు కలిసేనా, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక టిడిపికి లాభమేనా?ఆ వర్గాలు కలిసేనా, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి చేరిక టిడిపికి లాభమేనా?

కిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకికిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకి

అయితే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరితే ఇప్పటివరకు నల్లారి కుటుంబంతో విభేదించిన క్యాడర్ పరిస్థితి ఏమిటనే విషయమై చర్చ సాగుతోంది. అయితే పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళేలా అన్ని రకాల చర్యలు తీసుకొంటామని పార్టీ నాయకత్వం హమీ ఇస్తోంది.

ఇక్బాల్‌ అహ్మద్‌కు బాబు హమీ

ఇక్బాల్‌ అహ్మద్‌కు బాబు హమీ

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జీ ఇక్బాల్ అహ్మద్ బుదవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబునాయుడను అమరావతిలో కలిశారు.తాజా పరిణామాలపై చర్చించారు.నియోజకవర్గంలో పార్టీ కోసం ఆది నుంచి కష్టపడుతున్న నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని, ఈ విషయాన్ని గుర్తించి సమన్వయంతో కలిసికట్టుగా వ్యవహరించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేదని బాబు ఇక్బాల్‌కు హమీ ఇచ్చారు.

పీలేరు ఇంచార్జీ బాధ్యతలు నల్లారికేనా

పీలేరు ఇంచార్జీ బాధ్యతలు నల్లారికేనా

మాజీ ముఖ్యమంత్రి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని టిడిపిలో చేరిన వెంటనే పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు కట్టబెట్టే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. చంద్రబాబునాయుడు ఈ మేరకు చిత్తూరు జిల్లా నేతలతో బుదవారం నాడు సమావేశమైన తర్వాత ఈ మేరకు పార్టీ వర్గాలకు సంకేతాలు ఇచ్చారంటున్నారు. అయితే ఇప్పటివరకు ఇంఛార్జీగా ఉన్న ఇక్బాల్ అహ్మద్‌కు మంచి బాధ్యతలను కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గానికి చెందిన టిడిపి ముఖ్యులకు చెప్పారు. ఈ కారణంగానే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి సహకరిస్తే ఇబ్బంది లేదు

నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి సహకరిస్తే ఇబ్బంది లేదు

నల్లారి కిశోర్‌ కుమార్ రెడ్డి తమతో కలిసిమెలసి వ్యవహరిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని టిడిపి నేతలు కొందరు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళారు.అందరిని కిషోర్‌కుమార్ రెడ్డి కలుపుకుపోతారని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు హమీ ఇచ్చారు.

పీలేరులో గెలవాల్సిందే

పీలేరులో గెలవాల్సిందే

2019 ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. పూర్వ వాయల్పాడు, ప్రస్తుత పీలేరు నియోజకవర్గాల్లో సామాజిక న్యాయం నేపథ్యంలో మైనారిటీలకు మూడు పర్యాయాలు పార్టీ టికెట్లు ఇచ్చి అవకాశం కల్పించామని, నాల్గోసారి కూడా ఇదే ప్రయోగం చేసే పరిస్థితులు లేవని చంద్రబాబునాయుడు సర్ది చెప్పారు. పార్టీలో కొత్త, పాత నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని బాబు సూచించారు.

English summary
Andhra pradesh chief minister assured to Pileru Tdp incharge Iqbal ahmed. Iqbal ahmed and other Tdp leaders met Chandrababu naidu on Wednesday evening at Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X