చార్‌ధామ్ యాత్ర, భారీ మంచు వర్షం: బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగువాళ్లు, మాజీ సీఎం!
అమరావతి: చార్‌ధామ్ యాత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా భక్తులు చిక్కుకున్నారు. ఆ జిల్లాకు చెందిన 66 మంది భక్తులు చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌లో చిక్కుకున్నారు.
తాము మంగళవారం బద్రీనాథ్ కొండ పైన బస్టాండులో చిక్కుకున్నామని భక్తులు వెల్లడించారు. తమను రక్షించాలని కోరారు. వారు ఉదయం బద్రీనాథ్ చేరుకున్నారు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

దీంతో వారు కొండపై చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారు ప్రయాణించే బస్సు కూడా మంచులో చిక్కుకుపోయిందట. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన వారిలో అరవై మందికి పైగా మంచు వర్షంలో చిక్కుకొని అవస్తలు పడుతున్నారు.
చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి
ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, రాజ్యసభ సభ్యులు ప్రదీప్ తామ్టాలు కూడా బద్రీనాథ్, కేదరీనాథ్ యాత్రకు వెళ్లి మంచు వర్షం కారణంగా చిక్కుకుపోయారు. కేదార్నాథ్, బద్రీనాథ్‌ల వద్ద పెద్ద ఎత్తున మంచు వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications