వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ వేణు: ప్లెక్సీ విషయంలో కార్యకర్తల డిష్యూం డిష్యూం..

|
Google Oneindia TeluguNews

వైసీపీ శ్రేణుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్లెక్సీల విషయంలో మొదలైన గొడవ.. దాడి వరకు వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు బాహ బాహీకి దిగారు. కలుగజేసుకొని పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించివేశారు. తప్పు ఒకరిదంటే మరొకరిది అని ఆరోపణలు చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జిల్లా ఇంచార్జీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం పర్యటిస్తున్నారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లెక్సీ ఒక్కటి చినిగిపోయింది. దీంతో గొడవ చెలరేగింది. తమ ప్లెక్సీని వేణు వర్గీయులే చింపేశారని బోస్ వర్గీయులు ఆరోపించారు.

pilli subhash chandrabose v/s mla venu, workers fight on flexi issue

ప్లెక్సీ విషయంలో మాటా మాటా పెరిగింది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కలుగజేసుకొన్నారు. ఇరు వర్గాలను శాంతింపజేసి.. గొడవను సద్దుమణిగేలా చేశారు. వాస్తవానికి రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, వేణు మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. బుధవారం ఏర్పాటు చేసిన ప్లెక్సీ చినగడంతో అదీ బహిర్గతమయ్యాయి.

English summary
east godavari ramachandrapuram ycp workers are fight due to deputy cm pilli subhash chandra bose flexi issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X