వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పితాని సత్యనారాయణ తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పితాని సత్యనారాయణ తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్‌ను పితాని సత్యనారాయణ ఏమన్నారంటే?పవన్ కళ్యాణ్‌ను పితాని సత్యనారాయణ ఏమన్నారంటే?

జనసేన ఇంకా ఎదగలేదని చెప్పా

జనసేన ఇంకా ఎదగలేదని చెప్పా

మంత్రి పితాని సత్యనారాయణ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే, తాను పవన్ కళ్యాణ్‌ను విమర్శించలేదని చెప్పారు. పవన్ స్థాపించిన జనసేన ఇంకా ఎదగలేదని మాత్రమే తాను చెప్పానని చెప్పారు. పార్టీ నిర్మాణం కోసం తాను సూచనలు చేశానని చెప్పారు.

పితాని ఏమన్నారంటే

పితాని ఏమన్నారంటే

గురువారం మంత్రి పితాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పార్టీ ఏమిటో, ఆయన జెండా కట్టిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జెండా పట్టుకున్న కార్యకర్త, నాయకుడిని చూడలేదన్నారు. బయటకు రాకుండా సమస్యల మీద మాట్లాడుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ ధీటుగా

పవన్ కళ్యాణ్ ధీటుగా


పితాని సత్యనారాయణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు. నిన్న అశోక్ గజపతి రాజు తను ఎవరో తెలియదన్నారని, ఇప్పుడు పితాని తాను ఏమిటో తెలియదంటున్నారని వెటకారంగా ట్వీట్ చేశారు.

పితాని యూటర్న్

పితాని యూటర్న్

దీంతో పితాని సత్యనారాయణ తగ్గారు. తాను పార్టీ ఎదుగుదలకు సూచనలు చేశానని చెప్పారు. కాగా, పితాని సహా టిడిపి నేతల వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. నేతల మాటల తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి - జనసేనల మధ్య పొత్తు ఉండదని అర్థమవుతోందని అంటున్నారు.

చంద్రబాబు అసహనం?

చంద్రబాబు అసహనం?

ఇధిలా ఉండగా, పితాని సహా టిడిపి నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పైన ఆచితూచి స్పందించాలని హితవు పలికారని అంటున్నారు. అందుకే పితాని యూటర్న్ తీసుకున్నారని భావిస్తున్నారు.

English summary
Telugu Desam Party leader and Minister Pitani Satyanarayana took U turn on Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X