వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ పేరు మారిందా!? ఇకనుంచీ ‘జేఎమ్ఆర్’.. ఇదీ ‘పీకే’ వ్యూహమేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మారింది.. ఇక ముందు జగన్‌ను ‘జేఎమ్ఆర్’ అని పిలవాలట. ఇదంతా ప్రస్తుతం వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ (పీకే) వ్యూహమేనట.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మారిందా? ఇప్పటి వరకు అందరూ పిలిచే 'వైఎస్ జగన్' అని కాకుండా.. ఇకనుంచి కొత్త పేరుతో పిలవాలా? ఏమిటీ హఠాత్ పరిణామం అని ఆశ్చర్యపోతున్నారా?

Recommended Video

శ్రీవారిని దర్శించుకున్న జగన్:మళ్లీ వివాదం ! ఎందుకంటే? | Oneindia Telugu

వెంకన్న సన్నిధికి జగన్, షెడ్యూల్ లో మార్పు, రెచ్చిపోతున్న నేతలు, పరస్పరం విమర్శలువెంకన్న సన్నిధికి జగన్, షెడ్యూల్ లో మార్పు, రెచ్చిపోతున్న నేతలు, పరస్పరం విమర్శలు

నిజమే.. జగన్ పేరు మారింది.. ఇక ముందు జగన్‌ను 'జేఎమ్ఆర్'(JMR) అని పిలవాలట. ఇదంతా ప్రస్తుతం వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ (పీకే) వ్యూహమేనట.

పేరు మారితే మంచి జరుగుతుందా?

పేరు మారితే మంచి జరుగుతుందా?

వైఎస్ జగన్ పేరు మార్పు గురించి మరో పుకారు కూడా వినిపిస్తోంది. ఇది పీకే ప్లాన్ ఏమీ కాదని.. జగన్‌‌ నమ్మిన ఓ పెద్దాయన ఇలా పేరు మార్చుకొని చూడు అంటూ సలహా ఇచ్చారని, దీంతో జగన్ ఇకనుంచీ తనను జేఎమ్ఆర్ అని పిలవాలంటూ ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు.

జేఎమ్ఆర్ అని పిలవాల్సిందే...

జేఎమ్ఆర్ అని పిలవాల్సిందే...

ఇటీవల జగన్‌కు సంబంధించి పార్టీ నేతలందరికీ విచిత్రమైన సందేశాలు వచ్చాయట. వైసీపీ అధినేత జగన్ మెహన్‌రెడ్డిని ఇక ముందు అందరూ జేఎమ్ఆర్ అని పిలవాలన్నదే ఆ సందేశాల సారాంశమట. మొత్తానికి దీన్ని బట్టి ఇటీవల కాలంలో జాతకాలు, నమ్మకాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా ‘పీకే’ వ్యూహమేనా?

ఇది కూడా ‘పీకే’ వ్యూహమేనా?

ఇది కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యూహమేనని, పీకే చెప్పినట్లుగానే జేఎమ్ఆర్ అనే పిలవాలని పార్టీ నేతలకు జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్‌ను నామమాత్రం చేసేసి.. వైసీపీ అంతటా ప్రస్తుతం ‘పీకే'నే కనిపిస్తున్నారని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.

నిజమేనా? క్లారిటీ ఇస్తే బాగుండు...

నిజమేనా? క్లారిటీ ఇస్తే బాగుండు...

మొత్తానికి వైఎస్ జగన్ పేరు మారిందని, ఇకపై ఆయన పేరును ‘జేఎమ్ఆర్'గా అని వైసీపీ కార్యకర్తలు, పార్టీ నేతలు కూడా అలవాటు చేసుకోవాలని అంటున్నారు. అయితే జగన్ పేరు మార్చినట్లు వస్తున్న వార్తలపై ఇప్పటి వరకూ వైసీపీకి చెందిన నేతలెవ్వరూ స్పందిచలేదు. ఎవరైనా స్పందిస్తేగానీ ఈ వ్యవహారంపై ఒక క్లారిటీ వచ్చేలా లేదు. పాదయాత్ర సమయంలో జగన్ ఈ వ్యవహారంపై స్పందించే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Accordin to the sources, YCP Chief YS Jagan Mohan Reddy's Name was changed from YS Jagan to JMR. This is also part of the election planner PK's suggestion it seems. Already YCP leaders got messages regarding this name change, sources telling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X