మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాదం: కెసిఆర్ ఫామ్‌హౌస్ బావులపై పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లాలోని గజ్వెల్‌ ప్రాంతంలో ఎర్రవల్లి గ్రామంలో గల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు‌కు చెందిన రెండు బావులను మూసేయించాలని కోరుతూ మెదక్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అవి భూగర్భజల శాఖ, పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని మేకల విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

పేదలకు చెందిన బావులు, బోర్‌వెల్స్‌కు కెసిఆర్ ఫామ్‌హౌస్‌లోని బావులు ప్రమాదకరంగా పరిణమించాయని ఆయన అన్నారు. కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో రెండు పెద్ద బావులు ఉన్నాయని, అవి రెండు ఎకరాల విశాలంలో 70 అడుగుల లోతు ఉన్నాయని ఆయన చెప్పారు.

Plea against K Chandrasekhar Rao’s medak farm wells

భూగర్భ జల శాఖ నిబంధనలకు మాత్రమే కాకుండా వ్యవసాయ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు కూడా వ్యతిరేకంగా ఆ బావులున్నాయని ఆరోపించారు. వాటిని మూసేయడమే కాకుండా వాటిని పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మెదక్ జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ప్రతిని ప్రధఆనికి, సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు కూడా పంపించారు.

English summary
Seeking closure of the two wells at Chief Minister K. Chandrasekhar Rao’s farm, located at Erravally village in Medak, for not following the guidelines of the groundwater department, environmentalist Mekala Vishnuvardhan Reddy has filed a petition with the Medak district collector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X