వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాత్మా గాంధీ బ్రాండ్ అమెరికా బీరు: పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలోని న్యూ ఇంగ్లాండు మద్యం తయారీ కంపెనీ మహాత్మా గాంధీ బ్రాండ్‌తో బీరును తయారు చేసి, విక్రయిస్తోంది. దీనిపై న్యాయవాది ఒకరు హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ పేరును బ్రాండ్ నేమ్‌గా వాడుతూ బీర్ బాటిళ్లను ఆ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.

మహాత్మా గాంధీ బోట్ ప్రపంచంలో ప్రజాదదరణ పొందిన బీర్ బ్రాండ్లలో ఒక్కటని, అమెరికా, భారతదేశాల్లోనే కాకుండా ప్రపంచమంతా దానికి ఆదరణ ఉందని న్యాయవాది ఎస్ జనార్దన్ గౌడ్ చెప్పారు. అమెరికాలోని కనెక్టికట్ న్యూ ఇంగ్లాండు మద్యం తయారీ కంపెనీ దాన్ని తయారు చేస్తోంది.

Plea Against Mahatma Gandhi Logo On Beer

మహాత్మా గాంధీ పేరు వాడుకోవడం భారత చట్టాల ప్రకారం తీవ్రమైన నేరమని, అది శిక్షార్హహమైందని, ఖండించదగిందని ఆయన అన్నారు. 1971 జాతీయ గౌరవాన్ని అవమానించడాన్ని నిరోధించే చట్టం కింద అలా వాడడం నేరమని ఆయన అన్నారు. అది మహాత్మా గాంధీని కూడా అవమానిచండమేనని ఆయన అన్నారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీని భారతీయులు జాతిపితగా భావిస్తారు. ఆయన పూర్తిగా శాకాహారి మాత్రమే కాకుండా ప్రవర్తనలో నిజాయితీని కోరుకున్నారు.

English summary
A private petition was filed by an advocate in Nampally court against New England Brewing Company of United States, which uses Mahatma Gandhi’s name as a brand name for its beer Gandhi-Bot. The company launched its brand Gandhi-Bot in the international market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X