వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డర్టీ పొలిటిక్స్: నటి మల్లికా షెరావత్‌పై కోర్టులో ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ హిందీసినీ నటి మల్లికా షేరావత్ త్వరలో విడుదల కానున్న డర్టీ పాలిటిక్స్ సినిమాలో జాతీయ పతాకాన్ని అవమానించారని, ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతూ మానవ హక్కుల కార్యకర్త టి ధన్‌గోపాల్‌రావు హైదరాబాద్ కోర్టును ఆశ్రయించారు.

ఈ సినిమా నిర్మాత, నటుడు కస్తూర్ చంద్ బొకాడియా డర్టీ పాలిటిక్స్ సినిమా ప్రచారానికి సంబంధించి తొలి పోస్టర్ విడుదల చేశారని, ఆ పోస్టర్‌లో ఉద్దేశపూర్వకంగా జాతీయ పతాకాన్ని అవమానించిన దృశ్యం ఉందని తెలిపారు.

Plea filed in Hyderabad High Court against Mallika Sherawat

ఆ పోస్టర్‌లో అంబాసిడర్ కారు వద్ద మల్లికా షెరావత్ కూర్చొని ఉన్నారని, ఆ దృశ్యంలో జాతీయ పతాకాన్ని అగౌరవపరిచే విధంగా ఉందని పిటిషనర్ తెలిపారు. వాణిజ్య అవసరాలకు జాతీయ పతాకాన్ని ఉపయోగించరాదని, ఇలా చేయడం జాతీయ పతాకాన్ని అగౌరవపరచడమేనని తెలిపారు. ఈ

పోస్టర్‌ను ప్రదర్శించకుండా చూడాలని కోరారు. జాతీయ పతాకాన్ని అగౌరవపరిచిన వారిపై 1950, 1971 యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలని కోర్టును కోరారు.

English summary
Human rights activist, Mr T. Dhangopal Rao, has moved the Hyderabad High Court seeking action against Bollywood actress Mallika Sherawat for allegedly obscenely using the Indian tricolour in her upcoming film Dirty Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X