• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జడ్జిలపై ఫిర్యాదు: జగన్ కు భారీ షాక్ - సీఎంపై చర్యలకు సుప్రీంకోర్టులో పిటిషన్ -ఆర్టికల్ 121, 211

|

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై సంచలన ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తొలిసారి ప్రతికూలత ఎదురైంది. ఈ నెల 6న ఢిల్లీలో సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డేను కలిసిన జగన్.. ఏపీ హైకోర్టు జడ్జిలు, సుప్రీం జడ్జి ఎన్వీ రమణపై ఫిర్యాదు లేఖను అందించారని సీఎం సలహాదారు అజయ్ కల్లాం శనివారం(ఈనెల 10న) మీడియాకు వెల్లడించడంతో ఈ వ్యవహారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. సదరు లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఏపీ సీఎంపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులోనే సోమవారం పిటిషన్ దాఖలైంది.

సీఎం జగన్ అసాధారణ అడుగు - జస్టిస్ ఎన్వీ రమణపై పోరు ఉధృతం - రాష్ట్రపతి, ప్రధాని వద్దకు..

జగన్ తీరు అసాధారణం..

జగన్ తీరు అసాధారణం..

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను ఉద్దేశించి ఫిర్యాదు చేయడం, సీజేఐకి ఇచ్చిన లేఖ వివరాలను మీడియాకు బహిర్గతం చేయడంలో ఏపీ సీఎం జగన్ తీరు అసాధారణంగా ఉందని, ఇది ప్రజాస్వామిక న్యాయవ్యవస్థను అగౌరవపర్చినట్లవుతుందని, ఇందుకుగానూ ఆయన(సీఎం)పై చర్యలు తీసుకునే దిశగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అదే సమయంలో ఈ వ్యవహారంలో మరోసారి ప్రెస్ మీట్లు లేదా బహిరంగ ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలని పిటిషన్ లో కోరారు. ప్రముఖ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు..

జస్టిస్ రమణ పిల్లలపై ఫాల్తూ కేసు - జగన్‌కు 60 నెలల జైలు - ఏపీలో ఆర్టికల్ 356: ఎంపీ రఘురామ

రాజ్యాంగ ఉల్లంఘన..

రాజ్యాంగ ఉల్లంఘన..

‘‘హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 121, ఆర్టికల్ 211లో ఉంది. ఏపీ సీఎం స్వయంగా లేఖ రాయడం ద్వారా, తన ప్రతినిధులతో మీడియాతో మాట్లాడించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆయన(జగన్)కు న్యాయవ్యవస్థను విధిగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కానీ తన తీరుతో ఆయన ప్రజాస్వామిక వ్యవస్థలను అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. దీనిపై చర్యలకు ఆదేశించండి'' అని లాయర్ సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ లో పేర్కొన్నారు.

సీజేఐ కోర్టులో బంతి..

సీజేఐ కోర్టులో బంతి..

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై అసాధారణ ఆరోపణలు చేసిన ఏపీ సీఎం.. వాటిని మీడియా ద్వారా ప్రజలకు బహిర్గతం చేయడం ద్వారా న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసే ప్రయత్నం చేశారంటూ అడ్వొకేట్ సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించేది, లేనిది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం లేఖ ఇప్పటికీ సీజేఐ జస్టిస్ బోబ్డే పరిధిలో ఉండటం, దానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో తాజా పిటిషన్ పై కోర్టు ఎలా వ్యవహరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు..

  Ys Jagan కంప్లైంట్ To SC Chief Justice Bobde Against Andhra HC,SC Judge NV Ramana | Oneindia Telugu
  రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు?

  రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు?

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పట్ల కొందరు న్యాయమూర్తుల వ్యవహరా శైలిపై ఇప్పటికే సీజేఐకు లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇదే అంశంపై అతి త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను కలవబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్.. రాష్ట్రపతి, ప్రధానుల అపాయింట్మెంట్ కోరారని, అది ఖరారైన వెంటనే ఢిల్లీకి పయనమవుతారని విశ్వసనీయంగా తెలిసింది. సీనియారిటీ ప్రకారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో టాప్-2 జడ్జిగా ఉండటం, తదుపరి సీజేఐగానూ ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉండటం తెలిసిందే.

  English summary
  A petition was filed before the Supreme Court on Monday seeking action against Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy in relation to a press conference held by the YSR Congress government making allegations against sitting judges of Andhra Pradesh High Court and the Supreme Court.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X