అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరగా ఇచ్చేద్దాం!: రాజధానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాజధాని నగర సలహా కమిటీ నిర్ణయించింది. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి పి నారాయణ అధ్యక్షతన జరిగిన సలహా కమిటీ సమావేశానికి సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వీలైనంత త్వరగా లే అవుట్లు వేసి అభివృద్ధి చేసి ప్లాట్లను తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయమై కమిటీ పలు అంశాల పైన చర్చించింది.

 Plots to farmers as soon as possible in Amaravati

ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావు, జీఎంఆర్‌ గ్రూపు ప్రతినిధి బొమ్మిడాల శ్రీనివాస్‌, నూజివీడు సీడ్స్‌ ఎం ప్రభాకర రావు, పీపుల్‌ కేపిటల్‌ సీహెచ్‌ శ్రీనివాసరాజు తదితరులు హాజరయ్యారు.

రాజధాని ప్రాంతం బృహత్‌ ప్రణాళికలోని అంశాలను సిఆర్డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ వివరించారు. రాజధాని ప్రాంతం బృహత్‌ప్రణాళిక రాజధాని అవసరాలు తీర్చేలా ఉందా? ఇందులో ఏమైన సవరణలు చేయాలా? అన్న విషయాలను కమిటీ సభ్యులు చర్చించారు. ప్రధాన రాజధాని ప్రాంతం నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారం పదిరోజులకొకసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు.

English summary
Plots to farmers as soon as possible in AP capital city Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X