వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ టూర్, వైసీపీ-టీడీపీ మధ్య పోస్టర్ చిచ్చు: పచ్చ పగోడీగాళ్లారా.. దమ్ముంటేరండి.. కొడాలి నాని

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే కాదు, వైయస్సార్ కాంగ్రెస్ - టీడీపీ మధ్య కూడా వాగ్వాదానికి దారి తీసింది. అందుకు కారణం, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు... పలుచోట్ల బహిరంగంగా కనిపిస్తోన్న పోస్టర్లు.

బీజేపీ సభ విజయవంతమైందని అంగీకరించిన టీడీపీ!

బీజేపీ సభ విజయవంతమైందని అంగీకరించిన టీడీపీ!

ఏపీలో బీజేపీకి బలం లేదని, కానీ వైసీపీ ఈ సభకు జనసమీకరణ చేసిందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆరోపించారు. సభకు ముందు, తర్వాత కూడా ఆరోపణలు చేశారు. దీంతో పరోక్షంగా సభ విజయవంతమైందని టీడీపీ నేతలు కూడా అంగీకరించినట్లుగా అయిందని అంటున్నారు. ఇక బీజేపీ సభకు వైసీపీ జనాన్ని తరలించిందనే ప్రచారంపై వైసీపీ నేతలు ఘాటుగానే స్పందించారు.

కొడాలి నాని కౌంటర్

ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న పోస్టర్లుకొన్ని చోట్ల కలకలం రేపాయి. వైసీపీ వారు జన సమీకరణ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అన్నారు. దీనిపై స్వయంగా కొడాలి నాని స్పందించారు. 'పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫోటో, నా ఫోటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు మేం కాదు మోడీ ఐనా చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే' అని పోస్ట్ పెట్టారు.

లోకేష్ ట్వీట్

ప్రధాని నరేంద్ర మోడీ సభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలను పంపించారని నారా లోకేష్ ఉదయం ట్వీట్ చేశారు. 'ఆంధ్రులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకక పోగా మోడీ గారితో తో జోడి కట్టిన జగన్ గారు వైకాపా కార్యకర్తలను మోడీ గారి సభ కి పంపుతున్నారు!' అని పేర్కొన్నారు.

English summary
Poster ware between YSR Congress and Telugu Desam Party in Andhra Pradesh before and after Prime Minister Narendra Modi's AP tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X