వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయుల జీవితాలు కేలండర్లతో కాకుండా ప్రకృతితో ముడిపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో ఆదివారం ఘనంగా జరిగాయి.

ఈ సంక్రాంతి సంబరాలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి మోడీ చేతుల మీదుగా వెంకయ్య నాయుడు సన్మానం జరిపించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రకతిని కాపాడటం సవాలుగా మారిందని చెప్పారు.

అందుకే కాప్-21 సదస్సులో ప్రపంచాన్ని, పర్యావరణాన్ని రక్షించేందుకు తీర్మానాలు జరిగాయన్నారు. ప్రకృతితో సహజీవనం చేయడాన్ని జీవనశైలిగా మార్చుకోవాలన్న సందేశాన్ని అందజేసిందన్నారు. సూర్యచంద్రుల ఆధారంగా మానవ జీవనం కొనసాగుతోందని, ఒకప్పుడు అమావాస్య, పౌర్ణమిలను సెలవు దినాలుగా పాటించేవారన్నారు.

మన దేశంలో నాట్లు వేసే నాటి నుంచి పంట ఇంటికి వచ్చే వరకు పలు పండుగలు చేసుకుంటారని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ నుంచి పగలు ఎక్కువ సమయం ఉంటుందని, అదే విధంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సొంత ప్రాంతానికి దూరంగా ఉంటున్న వారు అంతా ఒకేచోట సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఆలోచనతో ఈ ఉత్సవాన్ని నిర్వహించానన్నారు. ఢిల్లీలో నివసిస్తున్న దక్షిణ భారతీయులు, వివిధ రంగాల విశ్రాంత ఉద్యోగులు కూడా సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

 ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కళలను ప్రోత్సహించడం, ప్రతిభకు పట్టం కట్టడం మంచి సంప్రదాయమని, అందుకే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి సన్మానం చేస్తున్నామని వెంకయ్య తెలిపారు.

 ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

కాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ తన కుమార్తెకు ఇటీవలె పెళ్లయిందని, కొత్త అల్లుడితో తమ గ్రామంలో సంబరాలు చేసుకోలేక పోయానని అన్నారు. వెంకయ్య నాయుడు నివాసంలో సంబరాలకు హాజరు కావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

 ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

అనంతరం స్వరాలాపనలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ప్రధాని మోడీ ఘనంగా సత్కరించారు. ప్రధాని, బాలుకు మాల వేసి జ్ఞాపికను అందించగా, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శాలువా కప్పారు.

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ ఉద్యమాన్ని ప్రచారం చేసేందుకు రూపొందించిన గీతాన్ని బాలు ఆవిష్కరించారు. తన జీవితంలో ఇది మరపురాని రోజని, ప్రపంచ నేతగా ఎదిగిన మోడీ పక్కన కూర్చోవటం మధురానుభూతి అని బాలు చెప్పారు. తాను పాడిన పాటల్లో స్వచ్ఛ భారత్‌ గీతమే గొప్పదని, దీన్ని మిగతా భారతీయ భాషల్లోకి అనువదిస్తానని అన్నారు.

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రదర్శించిన దక్షిణాది సంప్రదాయ నృత్యాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భరతనాట్యం, కన్నడ దీపనాట్యం, జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగువారి పిండివంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఈ సంక్రాంతి సంబరాలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రోహిణి, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, గెహ్లాట్‌, హర్షవర్థన్‌, నజ్మా హెప్తుల్లా, జయంత్‌ సిన్హా, వీకే సింగ్‌, హన్సరాజ్‌ ఆహిర్‌, నఖ్వీ హాజరయ్యారు.

 ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

ఢిల్లీలో సంక్రాంతి: వెంకయ్య ఇంట్లో బాలుకు మోడీ సన్మానం

బీజేపీ నాయకులు రామ్‌ మాధవ్‌, విజయేంద్రగుప్తా, విజయ్‌ గోయల్‌, గోవా గవర్నర్‌ మృదులా సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, సీవీసీ కేవీ చౌదరి, మాజీ ఎంపీ యార్లగడ్డ, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడు ఈ వేడుకలను ఇలాగే కొనసాగించాలని మంత్రులు ఆకాంక్షించారు.

English summary
PM Modi attends Sankranti celebrations in Venkaiah Naidu Residence in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X