వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: రాత్రి9కి పవర్ గ్రిడ్స్ సీన్ ఇది.. ఆ 9 నిమిషాల్లో ఇవి వద్దు.. ఏపీ సీఎం జగన్‌కు మోదీ థ్యాంక్స్

|
Google Oneindia TeluguNews

అంతా బాగున్నప్పుడు అందరూ సరదాగానే ఉంటారు.. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ధైర్యంగా నిలబడేవాడే సిసలైన మనిషని మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇవాళ ప్రపంచమంతా ఆ పాఠాన్ని ఆచరిస్తున్నది. పేదరికం అడుగడుగునా కనిపించే మనదేశంలోనై ప్రతి పౌరుడు ఓ సైనికుడై తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వానికి అండగా నిలవడందగ్గర్నుంచి, పేదలకు అన్నం పంచిపెట్టేవరు.. తోచినరీతిలో చేసుకుపోతున్నారు.

ప్రధానంగా, కరోనాపై యుద్ధంలో ముందుభాగాన నిలబడి, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ఈ కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉన్నామనడానికి సంకేతంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. ఇవాళ ఉదయం మరోసారి దేశ ప్రజలకు ఆ విషయాన్ని గుర్తుచేశారు.

9పీఎం-9మినిట్స్

9పీఎం-9మినిట్స్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్నది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనం ఒకింత ఆందోళనకు గురవుతున్న సందర్భంలో.. అందరికి అందరం అండగా ఉన్నామనడానికి సకేతంగా ఆదివారం(5 ఏప్రిల్) రాత్రి రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాలపాటు.. దేశ ప్రజలంతా తమ ఇళ్లలో లైట్లు ఆర్పేసి.. దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వెలుగును ప్రసరింపజేయండని ప్రధాని పిలుపునిచ్చారు. సమయం దగ్గరపడుతుండటంతో ఆదివారం ఉదయం మరోసారి మోదీ #9pm9minute హ్యాష్ ట్యాగ్ తో అందరినీ అలర్ట్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆ 9 నిమిషాల పాటు ఏం చెయ్యాలో ప్రజలకు సూచనలిచ్చింది.

స్ట్రీట్ లైట్లు బంద్ చేయొద్దు..

స్ట్రీట్ లైట్లు బంద్ చేయొద్దు..

ఇవాళ (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో 9 నిమిషాలు పాటు.. కేవలం లైట్లు మాత్రమే ఆర్పాలి. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్, కూలర్లు.. ఇతరత్రా నిత్యం ఆన్ లో ఉండాల్సిన వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఆఫ్ చేయొద్దు. ఊళ్లలోగానీ, సిటీల్లోని కాలనీలు, అపార్టుమెంట్లలోగానీ ట్రాన్స్ ఫార్మర్లు బంద్ చేయడానికి ఎవరు కూడా ప్రయత్నించొద్దు. అలా చేస్తే నేరంగా పరిగణిస్తారు. అలాగే, స్ట్రీట్ లైట్లను యధావిధిగా వెలగనివ్వాలి. వాటిని ఆర్పకూడదు. దేశవ్యాప్తంగా ఒకేసారి లైట్లు బంద్ చేస్తే.. పవర్ గ్రిట్స్ పై ప్రభావం పడే అవకాశమున్నందున, జనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర విద్యుత్ శాఖ సూచనలు జారీచేసింది. కాగా,

ఆ 9 నిమిషాలు ఏం జరుగుతుందంటే..

ఆ 9 నిమిషాలు ఏం జరుగుతుందంటే..

కరోనాపై పోరాటంలో సంఘీభావంగా ప్రజలంతా ఆదివారం రాత్రి9కి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేయడం ద్వారా దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ల వద్ద సుమారు 12,897 మెగావాట్ల లోడు తగ్గే అవకాశం ఉంది. ఈ అచనాల మేరకు ఆ 9 నిమిషాల పాటు ఉత్పత్తిని తగ్గించాలని.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఆదేశాలు వెళ్లాయి. మళ్లీ రాత్రి 9:09 నుంచి ఉత్పత్తిని పెంచి, సరఫరాను యధావిధిగా కొనసాగిస్తారు. మనం ఫ్యాన్లు, ఏసీలు కూడా బంద్ చేస్తే గ్రిడ్లు కుప్పకూలిపోతుంది. కాబట్టి విద్యుత్ శాఖ సూచనల్ని కచ్చితంగా పాటించాలి. ఆ 9 నిమిషాలు విద్యుత్ రంగంలోకి అందరూ టెన్షన్ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారు.

సీఎం జగన్, రాంచరణ్ కు మోదీ థ్యాంక్స్

మోదీ పిలుపుమేరకు ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించి, తద్వరా కరోనా చీకట్లను పారదోలుదామని సూచించిన ఏపీ సీఎం జగన్ కు ప్రధాని థ్యాంక్ చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో సహకారం ఎంతో విలువైందని, కరోనాపై పోరులో ప్రజల మధ్య ఐక్యత పెరగడానికి అది దోహదం చస్తుందని మోదీ అన్నారు. ఈ మేరకు జగన్ చేసిన ట్వీట్ పై మోదీ కామెంట్ చేశారు. 9పీఎం లైట్స్ ఆఫ్ పై సూచనలు చేసిన సినీ నటుడు రాం చరణ్ ను కూడా మోదీ మెచ్చుకున్నారు.

ఏపీలో మళ్లీ కేసులు పెరిగాయి..

ఏపీలో మళ్లీ కేసులు పెరిగాయి..

ఆదివారం మధ్యాహ్నానికి కొత్తగా 34 కేసులు వెలుగు చూడటంతో ఏపీలో మొత్తం పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 226కు పెరిగింది. వీరిలో ఎక్కువగా మర్కజ్ సంబంధిత వ్యక్తులే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా కేసుం సఖ్య 3726కాగా, మరణాల సంఖ్య 100కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 12లక్షల కేసులు, 65 వేల మరణాలు నమోదయ్యాయి.

English summary
PM Narendra Modi has reminded people to light up lamps on Sunday night to show the country's collective resolve to fight coronavirus. and thanked ap cm jagan for supporting his call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X