• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌కు దిమ్మతిరిగేలా జేఎఎం పంచ్ -నీ గురించి దేశమంతా తెలుసు -వైఎస్సార్ కొడుకు బీజేపీకి బానిసా?

|

దేశంలో కరోనా విలయానికి వేల మంది బలైపోతుండగా, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరతపై కేంద్ర రాష్ట్రాలు తగువులాటకు దిగడం, మోదీ అనుకూల, వ్యతిరేక సీఎంలు బాహాటంగా రాజకీయ విమర్శలు చేస్తుండటం సంచలనంగా మారింది. కరోనాపై ప్రధానితో ఫోన్ సంభాషణ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. 'మోదీ తన మన్ కీ బాత్ చెబుతున్నారే తప్ప మన మాటలు వినిపించుకోవట్లేద'ని మండిపడటం, దానికి బీజేపీ సీఎంలు ఘాటుగా స్పందించడం, అనూహ్య రీతిలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం జార్ఖండ్ సీఎంకు విమర్శించడం చర్చనీయాంశమైంది. కరోనా నిర్వహణలో అడ్డంగా ఫెయిలైన మోదీకి జగన్ వత్తాసు పలకడమేంటని సోషల్ మీడియాలోనూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో..

షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..

జగన్‌కు జేఎంఎం కౌంటర్..

జగన్‌కు జేఎంఎం కౌంటర్..

ప్రధాని మోదీని విమర్శించినందుకుగానూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ చేసిన ట్వీట్లు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. ‘‘డియర్ హేంత్ సోరెన్.. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఒక సోదరుడిగా ఒక విన్నపం చేస్తున్నాను. మన మధ్య ఎటువంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ, ఇలాంటి రాజకీయాలు మన సొంత దేశాన్ని బలహీనపరుస్తాయి.

ఇది కొవిడ్‌పై యుద్ధం జరుగుతున్న సమయం. ఇలాంటప్పుడు ఒకరిని వేలెత్తి చూపించే బదులు... మనమంతా కలిసి కొవిడ్‌పై సమర్థంగా యుద్ధం సాగించేలా ప్రధానమంత్రిని బలోపేతం చేయాలి'' అని హితవుతో కూడిన విమర్శను జగన్ సంధించారు. దీనికి జేఎంఎం పార్టీ శాఖలు సైతం ఘాటుగా కౌంటరిచ్చాయి..

బెయిల్ రద్దు.. జగన్ నిస్సహాయత..

బెయిల్ రద్దు.. జగన్ నిస్సహాయత..

కరోనా పరిస్థితుల నిర్వహణలో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ వత్తాసుపలికిన రోజే కోర్టులో ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా పడటం యాదృశ్చికమే అయినప్పటికీ, బెయిల్ రద్దు విచారణ వాయిదా వార్తల క్లిప్పింగ్స్ తో జేఎంఎం.. జగన్ పై ఎదురుదాడి చేసింది. ‘‘వైఎస్ జగన్‌జీ.. మీ నిస్సహాయత గురించి దేశం మొత్తానికి తెలుసు. అవును, మేం కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, గౌరవిస్తాం.. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం'' అని జేఎంఎం పార్టీ శాఖ ట్వీట్ చేసింది. మరోవైపు..

అనూహ్యం: మోదీకి జగన్ ఊపిరి -ప్రధానిపై జార్ఖండ్ సీఎం విమర్శలకు ఏపీ సీఎం కౌంటర్ -డియర్ హేమంత్..అనూహ్యం: మోదీకి జగన్ ఊపిరి -ప్రధానిపై జార్ఖండ్ సీఎం విమర్శలకు ఏపీ సీఎం కౌంటర్ -డియర్ హేమంత్..

  COVID : Lancet Criticized ఆగష్టు నాటికి 10 లక్షల మరణాలు Modi ప్రభుత్వమే బాధ్యత || Oneindia Telugu
  వైఎస్సార్ కొడుకేనా ఇలా?

  వైఎస్సార్ కొడుకేనా ఇలా?

  ‘‘కాంగ్రెస్ పార్టీలో శిఖరసమానుడైన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వంటి గొప్ప నేతకు కొడుకైన వైఎస్ జగనేనా ఇది? సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర సంస్థలకు భయపడి మోదీకి తాన అంటే తందాన అనడం విచారకరం. జగన్.. కొంచెం ఎదగండి! మీరిప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం అని గుర్తెరగండి'' అంటూ ఒడిశాకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి ఉలాకా ట్వీట్‌ చేశారు.

  జార్ఖండ్ సీఎం కనీసం ప్రధాని తప్పుల్ని ఎత్తిచూపితే, జగన్ మాత్రం భజన చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఈక్రమంలో అన్నాడీఎంకే బహిషృత నేత వీకే శశికళ పేరిటా కొన్ని ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘‘జగన్.. నీకు వెన్నెముక ఉందనుకున్నా, కానీ అదిలేని బానిసగా మారుతావనుకోలేదు, నీ ట్విటర్ హ్యాండిల్ బీజేపీ ఐటీ సెల్ చేతిలోకి వెళుతుందని నేను అసలు ఊహించలేదు. నిజంగా ఇది సిగ్గుచేటు''అని వీకే శశికళ అఫీషియల్ పేరుతో నడిచే ఓ సెటైరిక్ అకౌంట్ చేసిన ట్వీట్ వైరలైంది.

  English summary
  jharkhand cm Hemant soren JMM hits back at andhra pradesh cm and ysrcp chief ys jagan amid pm modi-cm hemant soren row. ys jagan reprimands hemant soren, jmm says 'The whole country is aware of your helplessness ys jagan". odisha congress mp Saptagiri Ulaka also slams ys jagan by naming ysr. fake tweets of vk sasikala slamming ys jagan also gone viral.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X