వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచు ఫ్యామిలీతో మీటింగ్‌పై మోదీ ట్వీట్.. ఏమేం మాట్లాడుకున్నారో వెల్లడించిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

టాలీవుడ్ లెజెండ్ మంచు మోహన్ బాబు కుటుంబాన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని, తాము అనేక విషయాలపై మాట్లాడుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం ఢిల్లీలో మోహన్ బాబు తన కూతురు లక్ష్మీ ప్రసన్న, కొడుకు మంచు విష్ణు, కొడలు వెరోనికా రెడ్డితో కలిసి మోదీని కలిసిన సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీని బీజేపీలో చేరాల్సిందిగా మోడీ ఆహ్వానించినట్లు వార్తలు రావడంతో ఈ భేటీకి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అయితే ఇది రాజకీయ భేటీకాదని మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు.

అవే మాట్లాడుకున్నాం..
ప్రధానితో మీటింగ్ తర్వాత మోహన్ బాబు తన ట్విటర్ లో ఫొటోను షేర్ చేస్తూ ''వాట్ ఏ మ్యాన్''అంటూ మోదీని కీర్తించారు. దాన్ని రీట్వీట్ చేసిన మోదీ.. మోహన్ బాబును కుటుంబంతో సహా కలుసుకోవడం సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. అలాగే, ''సినిమాల ప్రాముఖ్యతపై, ఆ మాధ్యమం ద్వారా ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను ఎలా పెంపొందింపజేసుకోవచ్చనే అంశాలపై మేం చర్చలు జరిపాం''అని ప్రధాని తెలిపారు. అంతకుముదు మంచు లక్ష్మీ.. మోదీని డైనమిక్ పీఎం అంటూ చేసిన ట్వీట్ కూడా వైరలైంది. ప్రధాని ఆలోచనల్ని అందరూ అర్థం చేసుకుంటే, మాటల్నిఆచరిస్తే ఇండియా ఎంతో గొప్ప స్థానంలో ఉంటుందని రాసుకొచ్చారు.

PM Modi Tweet On Meeting With Manchu Mohan Babus family

త్వరలో ప్రధానితో సౌత్ నటుల భేటీ..
మంచు లక్ష్మీ సంధానకర్తగా త్వరలోనే సౌత్ నటుల టీమ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కావాల్సిందిగా మోదీ నుంచి మాట తీసుకున్నానని లక్ష్మీ మీడియాకు తెలిపారు. ఇప్పటికే సౌత్ సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మోదీతో భేటీ కొత్త జోష్ ఇస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

English summary
It was a delight to meet your family and you, PM Modi Tweet On Meeting With Manchu Mohan Babu's family On Monday. It was a gesture call on behalf of south Indian Movie Artists, said Manchu Laxmi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X