వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ఎత్తు తగ్గింపు .. వ్యయ నియంత్రణ కోసం కేంద్ర జల శక్తి వనరుల శాఖ అధ్యయనం !!

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి ఎత్తు తగ్గించే అవకాశాలపై కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం నీటిమట్టం మూడు మీటర్ల మేర తగ్గింపుతో వ్యయ నియంత్రణ సాధ్యమవుతుందా అన్న దానిపై అధ్యయనం చేసిన కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఎత్తు తగ్గింపుపై చర్చిస్తోందని సమాచారం .

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై కేంద్రానికి జగన్ విజ్ఞప్తి .. జలశక్తి మంత్రితో భేటీలో సీఎం జగన్ చెప్పిందిదే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై కేంద్రానికి జగన్ విజ్ఞప్తి .. జలశక్తి మంత్రితో భేటీలో సీఎం జగన్ చెప్పిందిదే

ప్రాజెక్ట్ ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎత్తు తగ్గించే ఆలోచనలో కేంద్రం

ప్రాజెక్ట్ ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎత్తు తగ్గించే ఆలోచనలో కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించటం వల్ల ముంపును కూడా నివారించడానికి అవకాశం ఉందని అందుకు కావలసిన అధ్యయనం చేస్తున్నట్లుగా సమాచారం . ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎంత ఎత్తు తగ్గిస్తే ఎంత ముంపును నివారించడానికి అవకాశం ఉందన్న అంశంపై కేంద్ర జల సంఘం ,పోలవరం ప్రాజెక్టు అథారిటీ తదితర సంస్థలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. పోలవరం కనీస నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తు నుండి 38.05 మీటర్లకు తగ్గించటం , దీంతో పాటు పూర్తి నీటి మట్టం సామర్ధ్యాన్ని తగ్గించటం వల్ల రెండు ప్రయోజనాలు చేకూరుతాయని ఆలోచిస్తుంది కేంద్ర జలశక్తి వనరుల శాఖ .

నీటి మట్టాన్ని తగ్గించటం వల్ల ముంపుతో పాటు నిర్మాణ వ్యయ నియంత్రణ

నీటి మట్టాన్ని తగ్గించటం వల్ల ముంపుతో పాటు నిర్మాణ వ్యయ నియంత్రణ

నీటి మట్టాన్ని తగ్గించటం వల్ల ముంపుతో పాటు నిర్మాణ వ్యయాన్ని నియంత్రించవచ్చు అనే ప్రతిపాదన రావటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది .ప్రధానంగా పోలవరం నీటి సామర్ధ్యం , దానిని ఎంతకు తగ్గించాలి , ఎత్తు ఏ మేరకు తగ్గించాలి , అలా తగ్గిస్తే ఎంత వ్యయాన్ని నియంత్రించవచ్చు , ఏ మేరకు ముంపును తగ్గించవచ్చు . డిజైన్ మార్చే వీలుందా వంటి అనేక అంశాలపై సమావేశంలో చర్చించారు .

పోలవరం నిర్మాణ వ్యయం తగ్గించే పనిలో కసరత్తు చేస్తున్న కేంద్రం

పోలవరం నిర్మాణ వ్యయం తగ్గించే పనిలో కసరత్తు చేస్తున్న కేంద్రం


పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 150 అడుగులు. కనీస నీటిమట్టం 135 అడుగులు. కనీస నీటిమట్టం నిల్వ ఉంచితే ఒక లక్ష 36 వేల ఐదు వందల ఎకరాలకు పరిహారం చెల్లించాలి. లక్షకు పైగా కుటుంబాలు నిర్వాసితులు అవుతాయి. ఇలా చేస్తే ప్రాజెక్టు ఖర్చు 50 వేల కోట్లు అవుతుంది. ఇక దీని భరించడం కష్టమవుతుంది అన్న ఆలోచనలో ఉన్న కేంద్ర జల శక్తి వనరుల శాఖ పోలవరం ఎత్తు మూడు మీటర్ల వరకు తగ్గిస్తే అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తుంది.

డిజైన్ మార్చే వీల్లేదు , మీటర్ కంటే ఎత్తు తగ్గించే అవకాశం లేదన్న నిపుణులు

డిజైన్ మార్చే వీల్లేదు , మీటర్ కంటే ఎత్తు తగ్గించే అవకాశం లేదన్న నిపుణులు

పోలవరం ప్రాజెక్ట్ గరిష్ట వరద ప్రభావం 50 లక్షల క్యూసెక్కుల నీరుగా అంచనా వేసిన కారణంగా ఇందుకు తగినట్టుగానే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలని భావిస్తున్నారు . ప్రాజెక్ట్ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా గరిష్ట వరద ప్రభావం తట్టుకునేలా డిజైన్ ఉండాలని వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఒక మీటర్ కి మించి తగ్గించడానికి అవకాశం ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తమయినట్టు సమాచారం .అయితే ప్రాజెక్టు డిజైన్ మార్చటానికి అవకాశం లేదని కేంద్ర జల సంఘం అధికారులు స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఏదేమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి, వ్యయ నియంత్రణ కోసం ఎత్తు తగ్గించే ఆలోచనపై, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది

English summary
Information that the Polavaram project is undergoing a study on the possibility of reducing the height, as well as the possibility of cost control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X