వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ఏటీఎం కాదు ఎనీ టైమ్ వాటర్... ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఫైర్

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని మండిపడ్డారు. పోలవరం అంటే ఏటీఎం కాదు పోలవరం అంటే ఎనీ టైం వాటర్ అన్నారు దేవినేని. నర్మదా ప్రాజెక్ట్ ఏటీఎం అని పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దుర్మార్గమైనవిగా దేవినేని మండిపడ్డారు . ప్రధాని ఏపీ జీవనాడి అయిన పోలవరంపై అక్కసు వెళ్లగక్కాడంటూ ఫైర్ అయ్యారు.

<strong>మోదీ ఖ‌బ‌డ్దార్ : ప‌వ‌న్ కు ఓటేస్తే ఏం లాభం : సినిమాల్లేకే..మోహ‌న్‌బాబు ఇలా : చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!</strong>మోదీ ఖ‌బ‌డ్దార్ : ప‌వ‌న్ కు ఓటేస్తే ఏం లాభం : సినిమాల్లేకే..మోహ‌న్‌బాబు ఇలా : చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

పోలవరం ఏటీఎం అనటం తెలుగుజాతిపై విషం కక్కటమే .. దేవినేని ఫైర్

పోలవరం ఏటీఎం అనటం తెలుగుజాతిపై విషం కక్కటమే .. దేవినేని ఫైర్

అమరావతి లో మీడియాతో మాట్లాడిన మంత్రి దేవినేని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఖండించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎంతమంది ఆలోచనలు చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని అలాంటి పోలవరాన్ని చంద్రబాబు పూర్తి చేస్తున్నారని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు పై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ పోలవరాన్ని ఏటిఎం గా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు దేవినేని. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు తెలుగు జాతి పై దాడికి నిదర్శనమని ఆయన అన్నారు. పోలవరాన్ని ఒక్కసారి కూడా సందర్శించని ప్రధానికి ఏపీ పై ఏ మాత్రం ప్రేమ ఉందో అందరికీ తెలుసు అన్నారు దేవినేని.

గిన్నిస్ బుక్ లో స్థానం వచ్చినా పోలవరం సందర్శించని పీఎం మోడీ

గిన్నిస్ బుక్ లో స్థానం వచ్చినా పోలవరం సందర్శించని పీఎం మోడీ

తెలంగాణ సమ్మతితో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చారని, మోడీ దయాదాక్షిణ్యాలతో పోలవరానికి జాతీయ హోదా లభించలేదన్నారు మంత్రి దేవినేని పోలవరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నా , ఎన్డీఏ సర్కారు లోని కేంద్ర మంత్రులు తోటి ప్రశంసలు పొందినా అవి మోడీ కళ్ళు కనిపించడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పోలవరం ప్రాజెక్టును ప్రశంసించారని చెప్పిన దేవినేని అలాంటి పోలవరం నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగాయని ప్రధాని ఆరోపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఎన్డీయే అర్కార్లోని మంత్రులే ప్రశంసించారన్న మంత్రి దేవినేని

ఎన్డీయే అర్కార్లోని మంత్రులే ప్రశంసించారన్న మంత్రి దేవినేని

నితిన్ గడ్కరీ రెండుసార్లు పోలవరాన్ని సందర్శించిన పనులను ప్రశంసించారని గుర్తుచేసిన దేవినేని కేంద్రం నుండి ఇంకా 4483 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించారు. జులై నాటికి గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేసేందుకు చంద్రబాబు పనులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు మంత్రి దేవినేని. పోలవరం పై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి దేవినేని .

English summary
The Minister Devineni denies the comments made by Prime Minister Narendra Modi on the Polavaram project. The Polavaram project is described as ATM. Polavaram is not ATM .. Narmada project is ATM Devineni said that Polavaram is all time water, . Devaneni was seriously opposed with the comments made by the Prime Minister. Devineni gave reverse counter to Prime Minister's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X