• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ సమర్ధతకు పరీక్ష: నేటి నుండి పోలవరం పనులు ప్రారంభం: రెండేళ్లే గడువు..!

|

ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం నిర్మాణం అనేక అడ్డంకులు దాటి ఈ రోజు నుండి తిరిగి ప్రారంభం అవుతోంది. ఇప్పుడు మొదలవుతున్న పనులు ముఖ్యమంత్రి జగన్ సమర్ధతకు..రాజకీయ భవిష్యత్ కు కీలకం కానుంది. చంద్రబాబు హాయంలో పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెబుతూ.. నవయుగ సంస్థను తప్పించి ప్రాజెక్టుతో పాటుగా హైడల్ విద్యుత్ కేంద్రం పనులను సైతం మేఘా సంస్థలకు ఏపీ ప్రభుత్వం అప్పగించింది.

రివర్స్ టెండరింగ్ ద్వారా గతం కంటే రూ. 628 కోట్లు ఆదా చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో...ఇప్పుడు ప్రభుత్వం..మేఘా సంస్థ ఈ రోజు ప్రాజెక్టు సైట్ లో పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. మేఘా సంస్థ ఇప్పటికే అక్కడ కావాల్సిన సాంకేతికత..సిబ్బందిని సిద్దం చేసింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయటమే లక్ష్యంగా పనులు ప్రారంభిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీలో పోలీసు ఉద్యోగాల జాతర: 11,696 పోస్టుల భర్తీకి చర్యలు: త్వరలో నోటిఫికేషన్...!

పోలవరం పనులు తిరిగి ప్రారంభం..

పోలవరం పనులు తిరిగి ప్రారంభం..

దాదాపు ఆరు నెలల కాలంగా ఆగిపోయిన పోలవరం పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటికే పోలవరం పనులను పరిశీలించారు. టీడీపీ హాయంలో ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించిన వైసీపీ ప్రభుత్వం..గత ప్రభుత్వం లో పనులు నిర్వహించిన నవయుగను ప్రాజెక్టుతో పాటుగా హైడల్ పవర్ ప్రాజెక్టు నుండి తప్పించారు. దీని మీద నవయుగ కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు హైకోర్టు సైతం క్లియరెన్స్ ఇవ్వటంతో ప్రాజెక్టు నిర్మాణానినిక లైన్ క్లియర్ అయింది.

పనులు దక్కించుకున్న మేఘా సంస్థ పూజలు చేసిన తరువాత పనులు ప్రారంభించనుంది. పనులు కొనసాగించేందుకు అవసరమైన సాంకేతికతో పాటుగా.. సిబ్బందిని సైతం మేఘా సంస్థ సిద్దం చేసింది. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేఘా సంస్థ ప్రకటించింది. ఈ నెల రెండో తేదీ నుండి పోలవరం పనులు పూర్తి స్థాయిలో కొనసాగనున్నాయి.

రివర్స్ టెండరింగ్ తో628 కోట్ల రూపాయలు ఆదా

రివర్స్ టెండరింగ్ తో628 కోట్ల రూపాయలు ఆదా

ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన రివర్స్ టెండరింగ్ లో పాల్గొన్న మేఘా ఇంజనీరింగ్ గతంలో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువ శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. రివర్స్ టెండరింగ్ తోఏపి ప్రభుత్వానికి 628 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా..4358 మొత్తానికి మేఘా ఇంజనీరింగ్ టెండర్ దాఖలు చేసింది.

ఈ ప్రాజెక్టు పూర్తవుతే 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందటంతో పాటుగా..960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కి అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా..80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలింపు సాధ్యమవుతుంది. ఇక, 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలింపు.. పోలవరం కాలువకు అనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల కు త్రాగునీరు ఇచ్చే వెసులుబాటు కలుగుతుంది.

జగన్ సమర్ధతకు పరీక్ష్గగా...

జగన్ సమర్ధతకు పరీక్ష్గగా...

చంద్రబాబు హాయంలో ప్రాజెక్టు విషయంలో నాటి ప్రతిపక్ష నేతగా జగన్ అనేక ఆరోపణలు చేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరం లో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజా ధనం ఆదా చేసామని చెబుతున్న జగన్..ఇప్పుడు ప్రాజెక్టు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇప్పటికే ప్రకటించిన విధంగా 2021 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ సమయానికి పూర్తి చేయగలిగితే రాజకీయంగానూ జగన్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది.

ఇక, నదుల అనుసంధానం సైతం దీని ద్వారా సులువు కానుంది. చంద్రబాబు అయిదేళ్ల కాలంలో చేయలేనిది..తాను రెండేళ్ల కాలంలో పూర్తి చేసానని చెప్పుకొనే అవకాశం దక్కుతుంది. ఇక, గోదావరి జిల్లాల్లో జగన్ తన బలం మరింతగా పెంచుకొనే అవకాశం ఏర్పడుతుంది.

English summary
Polavaram project works re start to day. After many issues megha engineering starting works as per tender rate in fixed time. By 2021 govt planning to complete the project works along with hydal power project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X