వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం నిర్వాసితులకు తప్పక న్యాయం చేస్తాం .. 2022 ఖరీఫ్ నాటికి నీరందిస్తాం : సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరు అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ పోలవరం నిర్మాణం కోసం ఏర్పడిన ఆర్థికపరమైన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Recommended Video

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జ‌గ‌న్

స్టార్స్ అంతా డిసెంబర్ లోనే .. డైనమిక్ సీఎం జగన్ కూడా డిసెంబర్ లోనే : నటి పాయల్ రాజ్ పుత్స్టార్స్ అంతా డిసెంబర్ లోనే .. డైనమిక్ సీఎం జగన్ కూడా డిసెంబర్ లోనే : నటి పాయల్ రాజ్ పుత్

పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్ .. అధికారులతో సమీక్ష

పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం జగన్ .. అధికారులతో సమీక్ష

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు పోలవరం పర్యటనలో భాగంగా హెలికాప్టర్లో తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. స్పిల్ వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించిన సీఎం జగన్, కాపర్ డ్యామ్ పనుల పురోగతిని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన జగన్ గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రస్తుతం సమీక్ష సమావేశం నిర్వహించారు .

యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చెయ్యటానికి సీఎం జగన్ యత్నాలు

యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చెయ్యటానికి సీఎం జగన్ యత్నాలు

ఈ సమావేశంలో ఇప్పటివరకు అయిన పనులను, ఇంకా పూర్తికావలసిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో మాట్లాడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలనకు వెళ్లిన సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి ఆళ్ల నాని , తానేటి వనిత, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తదితరులు ఉన్నారు . ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

 పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో ఆందోళన .. న్యాయం చేస్తామని జగన్ హామీ

పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో ఆందోళన .. న్యాయం చేస్తామని జగన్ హామీ

రాష్ట్ర ప్రజలకు సాగునీరు అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ పోలవరంపై ఎన్ని వివాదాలు తలెత్తినా సరే 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని ఉన్నారు.

పోలవరం ముంపు గ్రామాల ప్రజలను 17వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది. నిర్వాసితులకు పరిహారం విషయంలో కేంద్రం మొండి చెయ్యి చూపించటంతో సీఎం జగన్ కు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యటం కత్తి మీద సాముగా మారింది. నిర్వాసితులు కేంద్రం నిధులు ఇవ్వమని చెప్పిన కారణంగా పరిహారం విషయంలో ఆందోళనలో ఉన్నారు. కానీ సీఎం జగన్ వారికి తప్పక న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.

English summary
AP CM Jagan Mohan Reddy inspected the construction work of the Polavaram project. As part of his visit to Polavaram, CM Jagan Mohan Reddy clarified that water would be provided through Polavaram by 2022 Kharif. Moreover, CM Jagan assured that justice would be done to the Polavaram settlers and hoped that all the financial problems created for the construction of Polavaram would be resolved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X