అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్: అదుపులో మద్దతుదారులు: కార్యకర్తల ఆందోళన..!

|
Google Oneindia TeluguNews

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక వైపు అమరావతి గ్రామాల్లో ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళన సాగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఆర్కే తన నియోజకవర్గంలో ప్రభుత్వం ఆలోచనలకు మద్దతుగా ర్యాలీకి సిద్దమయ్యారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెనుమాక నుంచి తాడేపల్లి భారతమత విగ్రహం వారకు భారీ ర్యాలీ తలపెట్టారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ ప్రారంభించారు. ఆ సమయంలో ర్యాలీకి అనుమతి లేదని..అమరావతి మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు అడ్డు చెప్పారు. అయినా ర్యాలీ కొనసాగింపుకే ఆర్కే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయటంలతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసారు.

వికేంద్రీకరణకు మద్దతుగా ఆర్కే ర్యాలీ..
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల పైన అమరావతి జేఏసీ పేరుతో ఆందోళనలు సాగుతున్నాయి. అదే సమయంలో అమరావతి గ్రామాల్లో రైతులు నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా అటు విశాఖలో..ఇటు రాయలసీమలో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే సైతం వికేంద్రీకరణకు మద్దతుగా పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీకి నిర్ణయించారు. అభివృద్ధి కావాలి.. వికేంద్రీకరణ జరగాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు.

Police arrest MLA RK against his rally in favour of three capitals

ఎమ్మెల్యే అరెస్ట్..మద్దతు దారుల ఆందోళన..
ఎమ్మెల్యే ఆర్కే పిలుపు మేరకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. అయితే నిషేధాజ్ఞలు ఉన్నందున ర్యాలీకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు. ర్యాలీ నేపథ్యంలో భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మహిళలు, నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రతిపాదనను నిరిసిస్తూ అమరావతి గ్రామాల ప్రజలు పోలీసు ఆంక్షల కారణంగా మందడం రోడ్డు మీద నుండి తమ దీక్షా స్థలిని మార్చుకున్నారు. ప్రయివేటు స్థలంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

Police arrest MLA RK against his rally in favour of three capitals
English summary
YCP Mangalagiri MLA Alla Rama krishna Reddy arrest. He called for rally in favour of govt proposal on three capitals against police restrictions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X