వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నతవిద్యావంతుడే...మోసపోయాడు.. మోసకారిగా మారాడు

ఉన్నత విద్యావంతుడు. ఉద్యోగంకోసం ప్రయత్నించి మోసపోయాడు. తాను ఎలా మోసపోయాడో....అతను కూడ అందరినీ మోసం చేస్తూ డబ్బులు సంపాదించాడు.ఈ మ్యారేజీ బ్యూరో, టెలికాలర్స్ ఉద్యోగాల పేరుతో మోసం చేశాడు. ఎట్టకేలకు పోల

By Narsimha
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా :ఉన్నత విద్యావంతుడే ...కాని ఉద్యోగం కోసం ప్రయత్నించి మోసపోయాడు. తాను మోసపోయినట్టుగానే అనేకమందిని మోసం చేశాడు. చివరకు జైలు పాలయ్యాడు. అనేకమందిని మోసం చేస్తూ డబ్బులు గడిస్తోన్న శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వేమవరానికి చెందిన మారేటి శ్రీనివాసరావు అలియాస్ ఈశ్వర్ అలియాస్ వెంకటరామిరెడ్డి పలువురిని మోసం చేస్తూ డబ్బులను వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.శ్రీనివాసరావు .ఎంటెక్ పూర్తిచేశాడు. ఉద్యోగం కోసం పత్రికల్లో వచ్చే క్లాసిఫైడ్ అడ్వర్ టైజ్ మెంట్స్ చూస్తూ దరఖాస్తు చేసేవాడు. అతను ధరఖాస్దు చేసిన సంస్థలన్నీ బోగస్ వనీ తేలిపోయింది. దీంతో నష్టపోయాడు.

తాను ఏ రకంగా మోసపోయానో అదే రకంగా అందరినీ మోసం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొన్నాడు. అదే ప్లాన్ ను అమలు చేశాడు.మ్యారేజ్ బ్యూర్ ను ఏర్పాటు చేశాడు. టెలికాలర్స్ ఉద్యోగం అంటూ పత్రికల్లో అడ్వర్ టైజ్ మెంట్స్ ఇచ్చాడు. తన తెలివిని ఉపయోగించి నిరుద్యోగులను మోసం చేశాడు.ఈశ్వర్, వెంకట్రాం రెడ్డి పేర్లతో 2014 లో వివాహపరిణయ వేదిక, మ్యారేజీ బ్యూరో లను ఏర్పాటు చేశాడు.

police arrested high edeucater cheater in east godavari

పెళ్ళిపీటల మీద వివాహం ఆగిపోయిన వారని, భర్తచనిపోయినవారని, భర్త విడిచిపోయినవారంటూ అందమైన యువతుల ఫోటోలను చూపేవాడు. అంతేకాదు పెద్ద మొత్తంలో కట్నం వస్తోందని ఆశచూపేవాడు. వీరిని వివాహం చేసుకొనేందుకు ముందుకు వచ్చేవారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవాడు.సరైన అడ్రస్ లేని సిమ్ కార్డుల ద్వారా ఫోన్ లు చేసేవాడు. అమ్మాయిల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమచేయించేవాడు. వారి నుండే ఆ డబ్బులను డ్రా చేయించి తీసుకొనే వాడు.

టెలికాలర్ ఉద్యోగాల కోసం తన వద్దకు వచ్చే వారి నుండి సర్టిఫికెట్లను తీసుకొనేవాడు. మ్యారేజీ బ్యూరో లో పేరుతో మోసం చేసిన వారి నుండి వసూలు చేసిన డబ్బులను టెలికాలర్ ఉద్యోగాల కోసం వచ్చే వారి అకౌంట్లలో జమచేసేవాడు. వారిచేతే ఈ డబ్బులను డ్రా చేయించి తీసుకొనేవాడు.డబ్బు డ్రా చేసిన తర్వాత సిమ్ కార్డును మార్చేవాడు.ఈ మోసాలకు బలైన వారు జూన్ లో కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేశారు.

జగన్నాథపురంలోని ఆంద్రాబ్యాంకు అకౌంట్ లో నాలుగున్నర లక్షల డిపాజిట్ అయిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ డిపాజిట్ ఆదారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.నిందితుడి నుండి 12 లక్షల విలువైన ఎక్స్ ట్రీమ్ కారు, సుజుకీ యాక్సిస్ స్యూటర్, 9 బంగారు ఉంగరాలు,బంగారు గొలుసులు, 50 సిమ్ కార్డులు, 10 సెల్ పోన్లు, 15 ఎటిఎం కార్డులను స్వాధీనం చేసుకొన్నారు.

English summary
m.srinivasa rao m.tech completed.he is searching for jobs cheted some people. he was financial loss.then he planned same cheating policy introduce for earning.he start marrage buerou, telecarer consultant, widows, lonely ladies marrage offers he given advertisements. when who approaches him . he demanded huge monedy. who has approached for telecarllers jobs. he deposited amount in enemployee ladies accounts . police enquired issue arrested srinivasa rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X