కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసలేమో బట్టతల...కానీ విగ్గుపెట్టి...సూటేసి ఫేస్ బుక్ లో వలేస్తాడు:అలా ఎంతోమంది అమ్మాయిల్ని కాటేశాడు

|
Google Oneindia TeluguNews

కర్నూలు:మోసపోయే వాళ్లుంటే మోసం చేసే వాళ్లు ఎంత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చో తేటతెల్లం చేశాడో ఛీటర్...పైగా ఇతడి బాధితులంతా అమ్మాయిలే ...దీంతో వాళ్లు ఇతగాడి బారిన పడి డబ్బూ నగలే కాదు మానం పరువూ ప్రతిష్ట అన్నీ పోగొట్టుకున్నారు. గతంలో ఇలా ఇతగాడి చేతిలో చిక్కి ఓ యువతి దారుణంగా మోసపోవడంతో ఆ విషయం తెలిసి ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంతకీ ఇతడు ఇలా అమ్మాయిల్ని మోసగించడానికి ఆయుధంగా వాడుకుంటోంది ఫేస్ బుక్ ని...పోనీ ఇంతమంది మోసపోవడానికి ఇతడేమీ నవ మన్మధుడు కూడా కాదు...నిజానికి ఇతగాడిది బట్టతల...కానీ విగ్గు పెట్టి...దాన్ని దాచి పెట్టి సూట్ బూట్ వేసి...ఆ ఫోటోలు నెట్ లో పెట్టి...మంచి మంచి కొటేషన్లు పెట్టి...మంచి మంచి పోస్టులతో అమ్మాయిలకు వల విసురుతుంటాడు...పొరపాటున ఏ అమ్మాయైనా ఆ పోస్టులకు లైక్ కొట్టిందో...ఇక ఆమె పని అంతే!..వివరాల్లోకి వెళితే...

 వీడే వాడు...ఇలా మోసం చేస్తాడు

వీడే వాడు...ఇలా మోసం చేస్తాడు

ఈ ఫోటో చూడండి...టీ షర్ట్ తో ఉన్న యువకుడు బట్టతలతో...మాసిపోయిన బట్టలతో వరద బాధితుడిలా ఉన్నాడు...ఆ పక్కనే ఉన్న యువకుడిని చూడండి...గిరజాల జుట్టుతో...సూట్ వేసుకొని సినిమా హీరోలా అందంగా ఉన్నాడు...నిజానికి ఈ రెండు ఫోటోల్లో ఉన్నది ఒక్కడే. సాధారణంగా మొదటి ఫోటోలో లాగా ఉండే ఆ వ్యక్తి ఫేస్ బుక్ లో అమ్మాయిల్ని పడగొట్టేందుకు ఆ అవతారం ఎత్తుతూ ఉంటాడు. అలా అందంగా ఉండే ఫోటోలు ఫ్రొఫైల్ గా పెట్టి మంచి మంచి ఆకట్టుకునే మెసేజ్‌లతో ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతూ ఉంటాడు. ఆ పోస్టులు, కొటేషన్ లకు ఏ అమ్మాయైనా లైక్ కొడితే వారితో మెల్లిగా చాటింగ్‌ మొదలుపెడతాడు.

 నిజ స్వరూపం చూపించి...బెదిరిస్తాడు

నిజ స్వరూపం చూపించి...బెదిరిస్తాడు

అలా వాళ్ల నుంచి సాధారణమైనవో...కుదిరితే అసభ్యమైన ఫోటోలో సేకరిస్తాడు. ఆ తరువాత కొద్దిరోజులకే తన నిజ స్వరూపాన్ని బైటపెడతాడు. ‘నా దగ్గర నీ న్యూడ్‌ ఫొటోలు ఉన్నాయి' అంటూ బెదిరించి లైంగికంగా లొంగదీసుకుంటాడు. ఆ తరువాత అక్కడ కూడా సీక్రెట్ కెమేరాలతో రికార్డ్ చేసి ఇక డబ్బు బేరాలకు దిగుతాడు. అలా అందినంత దోచుకొని ఇక ఆ ఖాతా మూసేస్తాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎంతోమంది యువతులతో ఇతగాడు చెలగాటం ఆడాడు. అమ్మాయిలు అంత తేలిగ్గా మోసపోతారా అనుకోవద్దు...ఇతడు ఇలా ఎంతోమందిని మోసగించినట్లు పోలీసులే చెబుతున్నారు.

గతంలోనూ...నేర చరిత్ర

గతంలోనూ...నేర చరిత్ర

మధ్యలో ఈ పోలీసులు ఎక్కడ నుంచి వచ్చారా?...అనుకుంటున్నారా?...ఇతగాడి పాపం పండి మరింత మంది యువతుల జీవితాలు నాశనం కాకముందే పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా ఇతగాడి చేతిలో మోసపోయిన ఓ యువతి ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు ఈ ప్రబుద్ధుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు అతగాడి వివరాలు ఇవి... కర్నూలు జిల్లా పగిడ్యాల మండలానికి చెందిన అవుజ రాజకుమార్‌ అలియాస్‌ తేజర్షి అలియాస్‌ తేజ (33) గతంలో ఆర్‌ఎంపీగా పనిచేశాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ మోసాలకు తెరతీసి సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన ఓ వివాహిత నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. వారిచ్చిన ఫిర్యాదులో భాగంగా 2016లో ఒకసారి...ఆ తరువాత మరోసారి అరెస్టు అయ్యాడు.

బాధితురాలి తండ్రి...ఆత్మహత్య

బాధితురాలి తండ్రి...ఆత్మహత్య

రాజకుమార్‌ ఈ తరహా నేరాలకు పాల్పడి రెండుసార్లు జైలు జీవితం గడిపినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా అదే తరహా నేరానికి పాల్పడి మరోసారి పత్తికొండ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరకాలంలో మహానందికి తన అడ్డా మార్చాడు. అక్కడ ఓ స్కూల్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు. అదే సమయంలో తన పాత నేర చరిత్రను కొనసాగించాడు. డాక్టర్ నని, తన ఆస్పత్రిలో ఉద్యోగాలని...ఇలాంటి మోసపుమాటలకు బెంగళూరుకు చెందిన ఓ యువతి ఇలాగే మోసపోగా,ఆ విషయం తెలుసుకొని ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇలా ఇతగాడి చేతిలో మోసపోయినవారిలో నంద్యాల, నల్గొండ, మదనపల్లె, కావలి, కంభం, హైదరాబాద్‌, కర్నూలు, పత్తికొండ యువతులు బాధితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

మాయగాడు...ఇలా పట్టుబడ్డాడు...

మాయగాడు...ఇలా పట్టుబడ్డాడు...

ఇతడి చేతిలో మోసపోయిన పత్తికొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా బాధిత యువతి మెయిల్‌ నుంచే ఓ అందమైన అమ్మాయి ఫొటోను రాజకుమార్‌ మెయిల్‌కు పంపి దాని ద్వారా అతని సెల్‌ఫోన్‌ నంబర్‌ కనుక్కుని నేరాన్ని ఛేదించారు. డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో పత్తికొండ రూరల్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ మారుతీశంకర్, తన సిబ్బందితో కలసి ఫేస్‌బుక్‌ ద్వారా రాజకుమార్‌ పేరు, అడ్రస్‌ తెలుసుకుని పక్కా సమాచారంతో వల పన్ని పత్తికొండ పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 36 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. గతంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన ఓ వివాహిత నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు లాక్కున్నాడు.

English summary
A facebook fraudster arrested in Kurnool, Andhra Pradesh for creating fake profile and also cheating so many ladies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X