హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాక్ గ్యాంగ్ లాటరీ మోసాలు: ముగ్గురి అరెస్ట్ (ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సౌదీ అరేబియా, పాకిస్థాన్ ముఠాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ సంబంధాలు లాటరీ మోసాలకే పరిమితమా? లేక ఐఎస్ఐ సంబధాలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అరెస్టైన ముగ్గురు ముఠా సభ్యుల నుంచి రూ. 15.1 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, 70 డెబిట్ కార్డులు, 40 నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులను అదనపు పోలీసు కమిషనర్ (క్రైం) సందీప్ శాండిల్యా మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలహాబాద్‌కు చెందిన మహ్మద్ జావేద్, లాలూ, మహ్మద్ షకీల్ చాలా కాలంగా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. ఈ క్రమంలో వీరికి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముఠాతో సంబందం ఏర్పడింది.

పాకిస్థాన్ ముఠాతో చేతులు కలిపిన జావేద్, లాలూ, మహ్మద్ షకీల్ వారితోపాటు మోసాలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. జావేద్, లాలూ, మహ్మద్ షకీల్ మనదేశంలోని అలహాబాద్‌లో ఉంటున్న వారి కుటుంబ సభ్యుల సహాయం తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు సెహన్షా (24), మహ్మద్ అఫ్తాబ్ (26), సుజీత్ కుమార్ (24)ల సహాయంతో మనదేశంలో ఉంటున్న వారి టెలిఫోన్ నెంబర్లను సేకరించి పాకిస్థాన్‌లో ఉంటున్న గ్యాంగ్ సభ్యులకు చేరవేస్తున్నారు.

ఈ నెంబర్ల సహాయంతో గ్యాంగ్ సభ్యులు పాకిస్థాన్ నుంచి పలువురికి ఫోన్ చేసి, లాటరీ వచ్చింది.. అంటూ నమ్మిస్తున్నారు. ఈ క్రమంలోనే కాచిగూడకు చెందిన తయ్యాబా సుల్తానాకు పాకిస్థాన్ నుంచి ఫోన్ చేసి రూ. 25 లక్షల లాటరీ వచ్చినట్లు చెప్పారు. అయితే కస్టమ్స్ డ్యూటీ, బ్యాంక్ క్లియరెన్స్, ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని, అందుకు కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నమ్మించారు. వారి మాటలను నమ్మిన బాధితురాలు దశలవారీగా రూ. 12 లక్షలు డిపాజిట్ చేసింది.

ఆ తర్వాత నిందితుల నుంచి సమాధానం రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితురాలు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు, పాకిస్థాన్ ముఠాతో అలహాబాద్‌కు చెందిన వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీంతో టెలిఫోన్ నెంబర్ల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు అలహాబాద్‌లో ఉంటున్న సెహన్షా, మహ్మద్ అఫ్తాబ్, సుజీత్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా మోసాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారని కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు.

ఎవరైనా ఫోన్ చేసి కెబిసి(కౌన్ బనేగా కరోడ్‌పతి)లో డబ్బు గెలుచుకున్నారని.. పన్నులు, బ్యాంకు రుసుముల కోసం కొంత డబ్బు పంపాలని చెప్తే నమ్మరాదని అన్నారు. లాటరీ గెలిచారని ఫోన్లు వస్తే నమ్మవద్దని నగర పోలీసు అదనపు కమిషనర్ సందీప్ శాండిల్య చెప్పారు. ఫోన్లలో ప్లస్ 92(పాకిస్థాన్ నుంచి)తో వచ్చే నెంబర్లకు జవాబు ఇవ్వరాదని అన్నారు. లాటరీ గెలిచినా అన్నిరకాల పన్నులను తీసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును ఇవ్వమని కోరాలని సూచించారు. జరుగుతున్న మోసాలను గ్రహించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

లాటరీ పేరిట మోసం

లాటరీ పేరిట మోసం

లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కెబిసిలో డబ్బులు గెల్చుకున్నారని ఫోన్లు చేసి పన్నులు కట్టేందుకు డబ్బులు చెల్లించాలని ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది.

డెబిట్ కార్డులు

డెబిట్ కార్డులు

లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సౌదీ అరేబియా, పాకిస్థాన్ ముఠాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డెబిట్ కార్డులు

మోసపోయిన బాధితురాలు

మోసపోయిన బాధితురాలు

హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన తయ్యాబా సుల్తానాకు పాకిస్థాన్ నుంచి ఫోన్ చేసి రూ. 25 లక్షల లాటరీ వచ్చినట్లు నిందితులు చెప్పారు. దీంతో ఆ మాటలు నమ్మిన బాధితురాలు పన్నుల కోసం చెల్లించమన్న రూ. 12 లక్షలను వారి ఖాతాలో జమ చేసి మోసపోయింది.

బుల్లెట్లు

బుల్లెట్లు

లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్లు.

స్వాధీనం చేసుకున్న నగదు

స్వాధీనం చేసుకున్న నగదు

హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన తయ్యాబా సుల్తానాకు పాకిస్థాన్ నుంచి ఫోన్ చేసి రూ. 25 లక్షల లాటరీ వచ్చినట్లు నిందితులు చెప్పారు. అరెస్టైన ముగ్గురు ముఠా సభ్యుల నుంచి రూ. 15.1 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, 70 డెబిట్ కార్డులు, 40 నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మీడియాతో మాట్లాడుతున్న కమిషనర్

మీడియాతో మాట్లాడుతున్న కమిషనర్

లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులను అదనపు పోలీసు కమిషనర్ (క్రైం) సందీప్ శాండిల్యా మీడియా ముందుకు తీసుకువచ్చారు.

నిందితులు

నిందితులు

హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన తయ్యాబా సుల్తానాకు పాకిస్థాన్ నుంచి ఫోన్ చేసి రూ. 25 లక్షల లాటరీ వచ్చినట్లు నిందితులు చెప్పారు. ఈ ముఠాకు సౌదీ అరేబియా, పాకిస్థాన్ ముఠాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ సంబంధాలు లాటరీ మోసాలకే పరిమితమా? లేక ఐఎస్ఐ సంబధాలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

 The city police on Friday busted a lottery racket operated by a Pakistan-based gang by arresting three persons from Allahabad, who were assisting the Pakistani gang in carrying out their operations in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X