కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమా అఖిల ప్రియ భర్త కోసం పోలీసులు ... వారెంట్ ఏదంటూ మాజీమంత్రి

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ క్రషర్ కు సంబంధించిన కేసు విషయంలో పరారీలో ఉన్న నేపధ్యంలో ఆయనను పట్టుకునేందుకు ఏపీ పోలీసులు వచ్చారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు కర్నూలు జిల్లా నుంచి పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాదులో యూసఫ్ గూడా లో భార్గవ్ రామ్ కి చెందిన మహాత్మా గాంధీ స్కూల్ లో భార్గవ్ రామ్ ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళటంతో హై డ్రామా నెలకొంది.

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ క్రషర్ కు సంబంధించిన కేసు విషయంలో పరారీలో ఉన్న నేపధ్యంలో ఆయనను పట్టుకునేందుకు ఏపీ పోలీసులు వచ్చారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు కర్నూలు జిల్లా నుంచి పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాదులో యూసఫ్ గూడా లో భార్గవ్ రామ్ కి చెందిన మహాత్మా గాంధీ స్కూల్ లో భార్గవ్ రామ్ ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళటంతో హై డ్రామా నెలకొంది.

భార్గవ్ రామ్ కోసం హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

భార్గవ్ రామ్ కోసం హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

కేసు విచారణ కోసం పోలీసులు భార్గవ్ రామ్ మహాత్మా గాంధీ స్కూల్ లో ఉన్నారని తెలియటంతో అక్కడికి వెళ్లారు . అయితే కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులను భార్గవ్ తో పాటు ఆయన అనుచరులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి అఖిలప్రియ సైతం పోలీసులను లోనికి అనుమతించలేదు. ఎలాంటి వారెంట్లు లేకుండా ఎలా సోదాలకు వస్తారని అఖిలప్రియ ప్రశ్నించారు.

పోలీసులతో అఖిల ప్రియ వాగ్వాదం

పోలీసులతో అఖిల ప్రియ వాగ్వాదం

పోలీసుల తీరుపై అఖిలప్రియ విమర్శలు గుప్పించారు.కావాలని కక్ష కట్టి తమను వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. పోలీసులు దౌర్జన్యంగా తాము ఉంటున్న స్కూల్ లోకి వచ్చి తమ పైన దాడి చేశారని అఖిల ప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇప్పటికే అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పై పలు కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇక తమ విధులకు ఆటంకం కలిగించడంతో భార్గవ్ అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వరుస కేసుల్లో చిక్కుకుంటున్న మాజీ మంత్రి భర్త భార్గవ్ రామ్

వరుస కేసుల్లో చిక్కుకుంటున్న మాజీ మంత్రి భర్త భార్గవ్ రామ్

అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై ఆళ్లగడ్డలో రెండు కేసులు నమోదయ్యాయి. క్రషర్ ఇండస్ట్రీ తనకు ఇవ్వాలని ఇండస్ట్రీ ఓనర్ ను భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో సదరు ఇండస్ట్రీ ఓనర్ శివరామిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనపై బెదిరింపుల కేసు నమోదైంది. ఇక హైదరాబాద్ గచ్చిబౌలి స్టేషన్ లోనూ భార్గవ్ రామ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ హైదరాబాద్ లో తన కారుకు అడ్డు వచ్చిన పోలీసులను సైతం భార్గవ్ రామ్ ఢీకొట్టి వెళ్లిపోయాడన్న వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదైంది. గతంలో భార్గవ్ రామ్ మీద ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున అహోబిలంలో జరిగిన ఘర్షణలో భార్గవ్ రామ్ మీద హత్యాయత్నం కేసు నమోదైంది.

వారెంట్ లేకుండా సోదాలకు అనుమతించం అని పోలీసులతో వాగ్వాదం

వారెంట్ లేకుండా సోదాలకు అనుమతించం అని పోలీసులతో వాగ్వాదం

తాజాగా భార్గవ రామ్ ను విచారించడానికి పోలీసులు యూసఫ్ గూడా లోని ఆయన ఉన్న పాఠశాలకు వెళ్లడంతో అక్కడ వారెంట్ లేకుండా లోపల సోదాలకు అనుమతించమని పోలీసులతో భూమా అఖిలప్రియ, అలాగే భార్గవ్ అనుచరులు వాగ్వాదానికి దిగడంతో ఏపీ పోలీసుల విధులకు ఆటంకం కల్గించారన్న కేసు కూడా నమోదు అయినట్టుగా తెలుస్తుంది . అయితే ఇదంతా అఖిలప్రియ మాత్రం కావాలనే కర్నూలు ఎస్పీ తమ కుటుంబంపై కక్ష కట్టారని ఆరోపించారు.

హైదరాబాద్ లో అఖిల ప్రియ భర్తను అరెస్ట్ చేసేందుకు హైడ్రామా

హైదరాబాద్ లో అఖిల ప్రియ భర్తను అరెస్ట్ చేసేందుకు హైడ్రామా

టిడిపి నాయకుల పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసమే ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక దీనితో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చిన పోలీసులు అక్కడ హంగామా చేశారు. ఇక భూమా అఖిల ప్రియ భర్తపై చెలరేగుతున్న వరుస వివాదాలు చివరకు ఏ రూపు తీసుకుంటాయో అనే అనుమానం కలుగుతుంది.

English summary
AP Police arrived at hyderabad to arrest Akhilapriya's husband bhargav ram . police got the informataion about bhargav ram as he is in the yousuf guda mahatma gandhi school However, Akhilapriya did not allow AP police into the school. Akhilapriya questioned how they would come without any search warrants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X