అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే జైలుకే .. ఎలమంచిలి ఎమ్మెల్యే బెదిరింపుపై పోలీసులకు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ వేసిన అభ్యర్థులు బెదిరించడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ పాలనలో నామినేషన్ల దాఖలు పెద్ద సమస్య.. బెదిరింపులు, పది రకాల కేసులు : సోము వీర్రాజు ఫైర్వైసీపీ పాలనలో నామినేషన్ల దాఖలు పెద్ద సమస్య.. బెదిరింపులు, పది రకాల కేసులు : సోము వీర్రాజు ఫైర్

ఫోన్లో బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు

ఫోన్లో బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు

విశాఖ జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ వేసిన వార్డు అభ్యర్థి అల్లుడు అయిన సంతోష్ ను బెదిరించారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ ఆయన ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. రాంబిల్లి మండలం లాలం కోడూరు పంచాయతీ శివారు సీతాపాలెం గ్రామానికి చెందిన లాలం సంతోష్ సొంత మామ లాలం కోడూరు పంచాయతీ వార్డు సభ్యుడిగా వైసిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే జైలుకు పంపిస్తానని వార్నింగ్ .. ఆడియో రికార్డ్ చేసిన బాధితుడు

నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే జైలుకు పంపిస్తానని వార్నింగ్ .. ఆడియో రికార్డ్ చేసిన బాధితుడు

అయితే నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని ఈరోజు అభ్యర్థి అల్లుడు సంతోష్ కి ఫోన్ చేసి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఫోన్ సంభాషణ రికార్డ్ చేసిన బాధితులు రాంబిల్లి పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. నామినేషన్ విత్ డ్రా చేయించకపోతే కేసులు పెడతామని జైలుకు పంపుతామని హెచ్చరించారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులకు ఎమ్మెల్యే తాలూకా ఆడియో రికార్డింగ్ కూడా అందజేశారు.

 పోలీసులకు బాధితుడి ఫిర్యాదు .. ఎమ్మెల్యే బెదిరింపుపై ఏపీలో చర్చ

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు .. ఎమ్మెల్యే బెదిరింపుపై ఏపీలో చర్చ

ఇక బాధితులకు మద్దతుగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్ కుమార్ నిలిచారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుదిగా చెప్తున్న ఆడియో ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకపక్క అచ్చెన్నాయుడు బెదిరింపుల వ్యవహారం అరెస్టు దాకా వెళ్లిన నేపథ్యంలో, తాజాగా ఎమ్మెల్యే బెదిరింపు వ్యవహారంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

English summary
Visakhapatnam district Elamanchili YCP MLA Uppalapati Ramanamurthy Raju alias Kannababu Raju has threatened Santosh, the son-in-law of the ward candidate nominated in the panchayat elections. MLA made phone threats that he would have to go to jail if the nomination was not withdrawn. The victims, who recorded the phone conversation, lodged a complaint with Rambilli police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X