వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకాను క్రూరంగా హింసించి..హ‌త్య‌ : వెలుగు లోకి కీల‌క అంశాలు : తొలుత ప్ర‌వేశించిన వారే..!

|
Google Oneindia TeluguNews

వైయ‌స్ వివేకానంద రెఢ్డిని అత్యంత క్రూరంగా హింసించి..హ‌త్య చేసారు. వివేకా మృత దేహాన్ని తొలుత చూసిన ఆ ముగ్గురుని పోలీసులు ఆరెస్ట్ చేసారు. అయితే, బాత్ రూంలో ప‌డిఉన్న మృత‌దేహాన్ని బెడ్ రూంలోకి త‌ర‌లించిన ఈ ముగ్గురు హ‌త్య‌గా చెప్ప‌ల‌దేనేది పోలీసుల అభియోగం. ఇదే స‌మ‌యంలో అక్క‌డ బొట్టు స్టిక్క‌ర్ల‌ను పోలీసులు గుర్తించా రు. ఇప్పుడు వీరిని మ‌రింత లోతుగా విచారించాల‌ని భావిస్తున్నారు.

క్రూరంగా హ‌త్య చేసారు..

క్రూరంగా హ‌త్య చేసారు..

సౌమ్యుడిగా పేరున్న వివేకానంద‌రెడ్డిని అత్యంత క్రూరంగా చంపిన‌ట్లు పోలీసులు తేల్చారు. ఆయ‌న మృతదేహంపై ఏడు చోట్ల పదునైన, లోతైన గాయాలున్నాయి. తలకైన తీవ్ర గాయాలు కనిపించకుండా బ్యాండేజీ వేశారు. వీటన్నిం టినీ విశ్లేషించిన తర్వాత అత్యంత క్రూరంగా వివేకానుహింసించి...ప్రమాదకరమైన ఆయుధంతో ఆయన తలపై దాడి చేసి చంపినట్లు తేలింది. హత్యకు పాల్పడిన దోషులెవరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌లకు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే నేర ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను తుడిచేసి..మాయం చేశారు. ఈ హత్యలో మరికొందరు వ్యక్తుల పాత్రపైనా అనుమానాలున్నాయి. ఇంకా చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉంది. సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంద‌ని వివేకా హత్యకేసులో పైన పేర్కొన్న నిందితుల అరెస్టుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన రిమాండు రిపోర్టు లో స్ప‌ష్టం చేసారు.

ఆ ముగ్గురే తొలుత అక్క‌డికి..

ఆ ముగ్గురే తొలుత అక్క‌డికి..

హ‌త్య జ‌రిగిన రోజు ఉద‌యం ఏం జ‌రిగిందో పోలీసులు త‌మ రిమాండ్ రిపోర్ట్ లో వెల్ల‌డించారు. ఆ వివ‌రాల ప్ర‌కారం చూస్తే.. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం 5.30 గంటలకు ఆయన వ్యక్తిగత సహాయకుడు వెంకటకృష్ణారెడ్డి ఆయన ఇంటికెళ్లారు. వివేకా ఇంటి నుంచి బయటకు రాకపోవటంతో కృష్ణారెడ్డి బయట కూర్చొని అరగంట పాటు దినపత్రికలు చదువుకున్నారు. ఆ తర్వాత వివేకా భార్య సౌభాగ్యమ్మకు ఫోన్‌ చేసి వివేకా నిద్రలేవలేదని, ఫోన్‌ చేసి లేపాలని కోరారు. అప్పుడే లేపొద్దని ఆమె సూచించారు. మరో అరగంట తర్వాత వంటమనిషి లక్ష్మి, ఆమె కుమారుడు ప్రకాశ్‌లు వివేకా ఇంటివద్దకు చేరుకున్నారు. కృష్ణారెడ్డి సూచన మేరకు వారిద్దరూ వివేకాను నిద్రలేపేందుకు పలుమా ర్లు పిలవగా స్పందన లేదు. అయితే.. ఇంటి పక్క డోరు తెరుచుకుని ఉందని వాచ్‌మెన్‌ రంగన్న చెప్పటంతో కృష్ణా రెడ్డి, ప్రకాశ్‌ కలిసి ఇంట్లోకి వెళ్లారు. వారు లోపలికి వెల్ల చూడగా..పడకగదిలో రక్తం కనిపించింది. చుట్టూ వెతగ్గా వివేకా బాత్‌రూమ్‌లో రక్తపుమడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత బయటకొచ్చి వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, భార్య వై.ఎస్‌.సౌభాగ్యమ్మకు ఫోన్‌ చేసి వివేకా మృతి విషయాన్ని తెలిపినట్లు వారు పోలీసు విచార‌ణ‌లో వెల్ల‌డించారు.

వివేకా హ‌త్య కేసులో ముగ్గురు అరెస్ట్ : సాక్ష్యాల‌ను తారుమారు చేసారు : కోర్టులో విచార‌ణ స‌మ‌యంలో..!వివేకా హ‌త్య కేసులో ముగ్గురు అరెస్ట్ : సాక్ష్యాల‌ను తారుమారు చేసారు : కోర్టులో విచార‌ణ స‌మ‌యంలో..!

ఆధారాల సేక‌ర‌ణ‌..

ఆధారాల సేక‌ర‌ణ‌..

వివేకామృతదేహంపై ఏడుచోట్ల పదునైన, లోతైన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు వాటి ఆధారంగా వివేకాది హత్యగా గుర్తించి..ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమెదు చేసిన‌ట్లు పేర్కొన్నారు. వివేకా పడకగది, స్నానపుగదిలోని రక్తపు మరకలను శుభ్రపరిచేందుకు వినియోగించిన ప్లాస్టిక్‌ బకెట్‌, తడిగుడ్డ, అక్కడున్న వెంట్రుకలు, బొట్టు స్టిక్కర్లతో పాటు వెంకటకృష్ణారెడ్డి దగ్గర నుంచి వివేకాకు చెందిన రెండు సెల్‌ఫోన్లు, లేఖ తదితరాలను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీ సులు ర‌మాండ్ రిపోర్ట్ లో స్ప‌ష్టం చేసారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుణ్ని గుర్తించేందుకు మరికొన్ని ఆధారా లు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి.. హత్య చేసిన వారు తప్పించు కొనేందుకు సహకరించిన వీరికి బెయిల్‌ ఇవ్వొద్దు. 15 రోజుల పాటు ముగ్గుర్ని పోలీసు కస్టడీకి ఇవ్వాలని రిమాండు రిపోర్టులో పోలీసు అధికారులు కోరారు.

English summary
Kadapa Police arrested three persons in Viveka murder case. Many issues find out in murder case. Police filed remand report in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X