• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫేస్‌బుక్ ప్రేమ: ఒక్క చోరీ కేసు.. బోలెడు ట్విస్టులు.. సినిమాను మించి

|

విశాఖపట్నం: విశాఖ నగరంలోని చెంగల్రావుపేట ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ నగల చోరీ కేసు పోలీసులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేసు పూర్వపరాలన్ని గందరగోళంగా ఉండటంతో ఈ చిక్కుముడి విప్పడం వారికి సవాల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. చెంగల్రావుపేట ప్రాంతానికి చెందిన కె.సాగర్ కు హైదరాబాద్ వాసి కీర్తిప్రియతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కీర్తిప్రియ గతంలో ఇదే ప్రాంతంలో ఉండి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు మారింది. ఫేస్ బుక్ ద్వారా సాగర్-కీర్తిప్రియల మధ్య ఏర్పడిన పరిచయం వారి మధ్య ప్రేమకు దారి తీసింది. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.

police held keerti priya for jewellery theft

ఇదే క్రమంలో ఈ ఏడాది మే నెలలో కీర్తిప్రియ విశాఖ చేరుకుని సాగర్‌ ఇంట్లో పది రోజులు గడిపింది. ఆ సమయంలో.. పెళ్లికి చేయించిన నగలను సాగర్‌ కుటుంబీకులు కీర్తిప్రియకు చూపించారు. అనంతరం కీర్తిప్రియ హైదరాబాద్‌ వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఓరోజు సాగర్‌కు ఫోన్‌ చేసిన కీర్తిప్రియ.. పెళ్లి కోసం చేయించిన నగలను ఒకసారి హైదరాబాద్ తీసుకురావాలని, ఒకసారి వాటిని ఫోటో తీసుకుంటానని చెప్పింది. దీంతో నగల కోసం బీరువా తెరిచి చూడగా.. అవి కనిపించలేదు. ఈ నెల 15న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాగర్ కుటుంబం ఫిర్యాదు చేసింది.

కీర్తిప్రియనే తమ ఇంట్లోని 20తులాల బంగారం చోరీ చేసిందని, తన ఇద్దరు స్నేహితుల ద్వారా అమ్మేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై గతంలోనే నాలుగో టౌన్, పీఎం పాలెంలోను కేసులు ఉన్నాయని తెలిపారు.

ఫిర్యాదు మేరకు కీర్తిప్రియను హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న పోలీసులు విశాఖపట్నం తరలించారు. ఆమె వద్ద నుంచి మూడు తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

కీర్తి ప్రియ ట్విస్ట్..:

సాగర్ తో తనకు పెళ్లయిందని, తనను వదిలించుకోవాలనే ఇలా కట్టు కథ అల్లాడని కీర్తిప్రియ ఆరోపించడం గమనార్హం. విశాఖలోనే తాను ఎంబీఏ పూర్తి చేశానని, తనకు గతంలో వివాహమై ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని ఆమె పేర్కొంది.

అయితే భర్తతో తనకు విడాకులయ్యాయని, కుమారుడు ప్రస్తుతం తన సోదరుడి ఇంటి వద్ద ఉంటున్నాడని తెలిపింది.ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో నెలకు రూ.35 వేల వేతనంతో పని చేస్తున్నానని చెప్పింది.

కొన్ని నెలల క్రితం సాగర్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఈ ఏడాది జూన్‌ 21న ఇద్దరం వివాహం కూడా చేసుకున్నామని తెలియజేసింది. తాము కాపురం కూడా చేశామని, అయితే ఆషాఢం మాసం కారణంగా తాను హైదరాబాద్ వెళ్లిపోవడంతో.. పెళ్లి సమయంలో తనకు పెట్టిన బంగారు నగలను మాత్రమే తీసుకుని వెళ్లానని పేర్కొంది.

అంతేకాదు, సాగర్ కు కూడా ఇదివరకే వివాహం జరిగిందని కీర్తిప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆ విషయాన్ని తనతో చెప్పకుండా పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపించింది. మోసం చేసే అలవాటు సాగర్ కే ఉందని, తనకు ఆ అవసరం లేదని చెబుతోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

సాగర్, అతని కుటుంబ సభ్యులు తనను వదిలించుకునేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. ఇక మరో ట్విస్ట్

English summary
Police held a woman Keerti Priya in jewellery theft case, his boyfriend sagar was complainted on her at Vizag police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X