అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్ డౌన్ లోనూ అమరావతి ఉద్యమం- రైతులకు పోలీసుల నోటీసులు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కొనసాగుతున్నా అమరావతిలో మాత్రం ఆందోళనలు ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఇక్కడి స్ధానికులు, రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు సీరియస్ అయ్యారు.

Recommended Video

Nandigam Suresh Says No Farmers Only Paid Artists In Capital Dharna
police issues notices to amaravati farmers for violating lockdown norms

లాక్ డౌన్ లోనూ ఉద్యమం...
ఏపీలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ మొదలుపెట్టిన ఉద్యమాన్ని అమరావతి రైతులు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగిస్తున్నారు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయాలు ఉన్నా.. రైతులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో వీరిని వారిస్తున్న పోలీసులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పలుమార్లు చెప్పి చూసినా వినకపోవడంతో వెంకటపాలెం గ్రామస్ధులకు జిల్లా పోలీసులు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరుతో నోటీసులు జారీ చేశారు.

police issues notices to amaravati farmers for violating lockdown norms

లాక్ డౌన్ లో ఎలా తిరుగుతారు ?
కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయని పోలీసులు నోలీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు యూనియన్ బ్యాంక్ సమీపంలో ఎవరి ఇళ్లలో వారు అమరావతి జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 12 నుంచి 15 మంది ఉద్యమం చేస్తున్నారని లాక్‌డౌన్ సమయంలో వీరు బయట తిరగడం, కలవడం జరిగిందని నోటీసులో తెలిపారు.అయితే జిల్లాలో సెక్షన్ 144 సీర్‌పీసీ, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున సెక్షన్ 188, 269, 270, 271 ఐపీసీల ప్రకారం చట్టరీత్యా నేరం అంటూ మహిళా రైతులకు, రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ కారణాల వల్ల మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

English summary
guntur district police officials issues notices to amaravati farmers for their agitations during lockdown situation. police asked farmers why shouldn't take action against them for violating the norms of lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X