అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత ... లాఠీ చార్జ్ .. ఆందోళనకారుల అరెస్ట్..భగ్గుమన్న టీడీపీ

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నివాసం దగ్గర ఇద్దరు వ్యక్తులు డ్రోన్ల తో ఫోటోలు, వీడియోలు తీస్తున్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు ఇంటి వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు ఇంటిని ఫోటోలు ,వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి అంటూ టిడిపి కార్యకర్తలు ప్రశ్నించారు. టీడీపీ ముఖ్య నాయకులు సైతం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ల వ్యవహారం .. టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణ

చంద్రబాబు ఇంటిపై డ్రోన్లతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్న ఘటన టీడీపీ శ్రేణుల్లో పలు అనుమానాలకు కారణం అయ్యింది.ఇక ఇదే సమయంలో చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ వ్యవహారంలో పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వీరికి పోటీగా వైసిపి కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీన్తి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ విషయం తెలుసుకున్న టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, వర్ల రామయ్య ,ఆలపాటి రాజా అక్కడికి చేరుకొని వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం పై మండిపడ్డారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కి ఇది తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల లాఠీ చార్జ్.. పలువురు అరెస్ట్

చంద్రబాబు ఇంటిపై డ్రోన్లను ఉపయోగించిన ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఇక ఈ ఘటనతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు.దీంతో ఆందోళన ఉధృతం కాగా పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు తరిమికొట్టారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మరి కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రోన్ల సహాయంతో చంద్రబాబు ఇంటిని వీడియోలు ఫోటోలు తీయడం పై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు.

చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని టీడీపీ నేతల ఆందోళన .. వర్ల ఏమన్నారంటే

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు. అసలు చంద్రబాబు ఇంటిని డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించాలని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఇదంతా భౌతికంగా నష్టం కలిగించాలనే ప్రయత్నమే అని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇంటి పై బాంబులు వేయాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ఇంట్లో పనిచేసే కిరణ్‌కు చంద్రబాబు ఇంటికి డ్రోన్లను పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడని వర్ల రామయ్య ఆరోపించారు. వరద పరిస్థితులను చంద్రబాబు ఇంటి నుండి పర్యవేక్షిస్తారా అని ప్రశ్నించిన వర్ల రామయ్య చంద్రబాబు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.

English summary
The use of a drone camera near the residence of the former Chief Minister Chandrababu Naidu has turned controversial. TDP cadre has alleged that it is a conspiracy by the ruling party. On the other hand, the Police used lathi-charge against the TDP protesters who have raised slogans against YS Jagan Mohan Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X