హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ యాంకర్ హర్షవర్ధన్ ఇంట్లో పోలీసుల సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో ఉంటున్న టీవీ యాంకర్ హర్షవర్ధన్ నివాసంలో ఏలూరు పోలీసులు సోదాలు నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ ఉద్యోగి హరినాథ్ అనే వ్యక్తిని బెదిరించి రూ.13 లక్షలు వసూలు చేసిన కేసులో పోలీసులు మంగళవారంనాడు ఆ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

మీడియాలోని మరో చీకటి కోణం వెలుగు చూసింది. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డ యాంకర్ ని పోలీస్ లు అరెస్టు చేసారు. డెంటల్‌ కళాశాల కరస్పాడెంట్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి కోట్లాది రూపాయలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణపై ఓ ప్రముఖ చానల్‌లో క్రైం న్యూస్‌ యాంకర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్‌ని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు సమీపంలోని సెయింట్‌ జోసఫ్‌ డెంటల్‌ కళాశాల కరస్పాండెంట్‌ రెవరెండ్‌ ఫాదర్‌ పి.బాలను ఓ క్లిప్పింగ్‌ ఆధారంగా హర్షవర్ధన్‌ తరచూ ఫోన్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. రూ.5కోట్లు ఇవ్వాలని లేకుంటే పరువు బజారుకీడుస్తానంటూ బెదిరించేవారు. దీంతో ఫాదర్‌ బాల పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రఘురామ్‌రెడ్డికి హర్షవర్ధన్‌పై ఫిర్యాదు చేశారు.

Police made searches in anchor Hrashavardhan residence

ఛానెల్‌ యాంకర్‌ హర్షవర్ధన్‌ను విజయవాడ పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటివారంలో అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులోని మెడికల్‌ కళాశాల కరస్పాండెంట్‌ అయిన ఫాదర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిన హర్షవర్ధన్‌ అక్కడి నుంచి కారులో పరారవుతున్నారన్న సమాచారం మేరకు విజయవాడ పోలీసులు ఐదవ నెంబర్‌ జాతీయ రహదారిపై హర్షవర్ధన్‌ను అదుపు లోకి తీసుకుని కారు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఐదవ నెంబర్‌ జాతీయ రహదారిపై రామవరప్పాడు సమీపంలో పటమట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పటమట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఏలూరు పోలీసులు అప్రమత్తం అయ్యాక పటమట పోలీసులకు హర్షవర్ధన్‌ పట్టుబడ్డాడు. అక్కడి మెడికల్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు స్పందించారని తెలిసింది. ఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో క్రైం నంబర్‌ 276గా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల సమాచారం మేరకు విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు వద్ద పటమట పోలీసులు కారులో వస్తున్న హర్షవర్ధన్‌ను, అతనితోపాటు ఉన్న విజయకుమార్‌ అనే మరో విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని పశ్చిమ గోదావరి పోలీసులకు అప్పగించారు.

English summary
Eluru police have made searches in TV anchor Harshavardhan's residence at Kukatpally in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X