అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3 వేల మంది మహిళలు రౌడీలా, ఉగ్రవాదులా..? జాతీయ మహిళా కమిషన్‌తో కేశినేని నాని

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధాని మార్పుపై విజయవాడలో ఆందోళన చేసిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించి వివరాలు తెలుసుకొన్నారు. అటు నుంచి విజయవాడ వచ్చి బాధిత మహిళలతో మాట్లాడారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఎంపీ కేశినేని నాని పోలీసుల తీరును తప్పుపట్టగా.. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనపై మిన్సింగ్ కేసు పెట్టడం సరికాదని విమర్శించారు.

 3 వేల మంది మహిళలు..

3 వేల మంది మహిళలు..

రాజధాని మార్పును నిరసిస్తూ విజయవాడలో 3 వేల మంది మహిళలు ఆందోళన చేపట్టారు. అయితే వారిని పోలీసులు వివిధ పీఎస్‌లకు తిప్పుతూ రాత్రి 9 గంటల తర్వాత వదిలిపెట్టారని ఆరోపించారు. దీనిపై ఆదివారం జాతీయ మహిళా కమిషన్ విజయవాడలో మహిళలతో మాట్లాడింది. శుక్రవారం ఏం జరిగిందనే అంశంపై ఆరాతీసింది. మహిళా కమిషన్ సభ్యులతో స్థానిక ఎంపీ కేశినేని నాని కూడా ఉన్నారు.

రౌడీలా..? ఉగ్రవాదులా..?

రౌడీలా..? ఉగ్రవాదులా..?

మహిళలు చేసిన తప్పేంటని కేశినేని నాని ప్రశ్నించారు. వారు ఏదైనా సంస్థకు చెందినవారా..? రౌడీలా? గుండాలా? ఉగ్రవాదుల అని అడిగారు. తమ ప్రాంత అభివృద్ధి రాజధానితో జరుగుతుందని.. క్యాపిటల్ సిటీ మార్చొద్దని ఉద్యమిస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి వారిని 4 గంటల పాటు.. వివిధ పోలీసు స్టేషన్లు తిప్పడం ఏంటీ అని అడిగారు.

తుంగలో తొక్కి

తుంగలో తొక్కి

మహిళలను పోలీసుస్టేషన్ తీసుకెళ్లే సమయంలో కూడా నియమ, నిబంధనలను ఉల్లంగించారని కేశినేని నాని పేర్కొన్నారు. 6 గంటల తర్వాత వారిని వదిలేశారని ఇది జాతీయ మహిళ కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. సీఆర్పీసీ 46 సెక్షన్ ప్రకారం మహిళలను 6 గంటల తర్వాత పీఎస్‌లో పెట్టడం నేరమని, అదే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు.

మిస్సింగ్ కేసు...

మిస్సింగ్ కేసు...


జాతీయ మహిళా కమిషన్‌కు మహిళల ఫిర్యాదుపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తన అందుబాటులో లేనని, మిస్సింగ్ కేసు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. టీడీపీ నేతలు ముందుండి రాజకీయ ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత మహిళ ఎమ్మెల్యే అని తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

 రాయి వేయండి..

రాయి వేయండి..

సభల్లో కొన్ని వీడియోలు చూస్తే భయమేస్తుందని చెప్పారు. వెనక నుంచి కొందరు రాయి వేయండి, కొట్టండి అని అనడం చూస్తే కావాలనే రెచ్చగొడుతున్నారని అర్థమవుతోందన్నారు.

English summary
police mis-behave womans mp kesineni nani told to national woman commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X